Manchu Manoj: మంచు వారింట మొదలైన పెళ్లి సందడి! మనోజ్- మౌనికల వివాహం అక్కడే! మెహెందీ ఫొటోలు షేర్ చేసిన మంచు లక్ష్మీ!
మంచు వారింట పెళ్లి సందడి మొదలైంది. టాలీవుడ్ హీరో మంచు మనోజ్- భూమా మౌనిక రెడ్డిల వివాహ వేడు కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుక్రవారం (మార్చి3) రాత్రి 8 గంటల 30 నిమిషాలకు మనోజ్- మౌనిక ఒక్కటి కానున్నారు.
మంచు వారింట పెళ్లి సందడి మొదలైంది. టాలీవుడ్ హీరో మంచు మనోజ్- భూమా మౌనిక రెడ్డిల వివాహ వేడు కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుక్రవారం (మార్చి3) రాత్రి 8 గంటల 30 నిమిషాలకు మనోజ్- మౌనిక ఒక్కటి కానున్నారు. మంచు లక్ష్మీ ప్రసన్న ఇంట్లోనే మనోజ్- మౌనికల వివాహ వేడుక జరగనుందట. పెళ్లి కార్యక్రమాలన్నింటినీ ఆమె దగ్గరుండి చూసుకుంటున్నారట. ఇక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా మెహందీ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. నేడు సంగీత్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. కాగా మెహందీకి సంబంధించిన ఫొటోలను మంచు లక్ష్మీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. దీంతో అవి వైరల్‌గా మారాయి. మంచు మనోజ్ వివాహవేడుకకు కేవలం ఇరు కుటుంబసభ్యులు, అతికొద్దిమంది సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరకానున్నారట. మంచు మనోజ్‌తో పాటు భూమా మౌనిక రెడ్డికి కూడా ఇది రెండవ వివాహమే. హైదరాబాద్ కి చెందిన ప్రణతి రెడ్డిని 2015 లో పెళ్లి చేసుకున్నాడు మంచు మనోజ్. అయితే నాలుగేళ్ల తర్వాత 2019లో విడాకులు తీసుకుని విడిపోయాడు.
ఆ తర్వాత మంచు మనోజ్ రెండో పెళ్లి గురించి పలు రూమర్లు తెరమీదకు వచ్చాయి. అదే సమయంలో కర్నూలు జిల్లాకు చెందిన దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికతో పబ్లిక్‌గా కనిపించాడు మనోజ్. దీంతో వారిద్దరు పెళ్లి చేసుకుంటారనే వార్తలు జెడ్ స్పీడ్‌లో ఊపందుకున్నాయి. అయితే ఇప్పటివరకు అటు మనోజ్ కుటుంబ సభ్యులు కానీ, ఇటు మౌనిక కుటుంబ సభ్యులు కానీ ఈ వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం కొసమెరపు. ఇక సినిమాల విషయానికొస్తే.. మంచు మనోజ్ వెండితెరపై కనిపించి చాలా కాలం అవుతుంది. ఇటీవల ‘వాట్ ది ఫిష్’ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..