AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swara Bhaskar: ఫస్ట్‌ నైట్‌ ఫొటోలు షేర్‌ చేసి షాకిచ్చిన హీరోయిన్‌.. నెటిజన్ల రియాక్షన్‌ ఏంటో తెలుసా?

హిందీ సినిమాలు చూసేవారికి హీరోయిన్‌ స్వరా భాస్కర్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందం, అభినయంతో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుం

Swara Bhaskar: ఫస్ట్‌ నైట్‌ ఫొటోలు షేర్‌ చేసి షాకిచ్చిన హీరోయిన్‌.. నెటిజన్ల రియాక్షన్‌ ఏంటో తెలుసా?
Swara Bhaskar
Basha Shek
|

Updated on: Mar 02, 2023 | 10:00 PM

Share

హిందీ సినిమాలు చూసేవారికి హీరోయిన్‌ స్వరా భాస్కర్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందం, అభినయంతో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ అందాల తార తరచూ తన పోస్టులతో వార్తల్లో నిలుస్తుంటుంది. ఇదిలా ఉంటే ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది స్వరా భాస్కర్‌. ప్రముఖ పొలిటికల్‌ లీడర్‌ ఫహద్‌ అహ్మద్‌తో కలిసి పెళ్లిపీటలెక్కింది. ఫహద్‌తో కలిసి పలు పొలిటికల్‌ ఈవెంట్లలో కనిపించింది. ఈక్రమంలోనే వారి మధ్య స్నేహం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా చిగురించి పెళ్లి వరకు చేరుకుంది. అయితే ఫహద్ అహ్మద్‌తో ప్రేమను చాన్నాళ్లపాటు రహస్యంగా ఉంచిన స్వర సడెన్‌గా పెళ్లి చేసుకుని షాక్‌ ఇచ్చింది. ఇటీవల కోర్టులో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఫహద్‌ను వివాహం చేసుకుంది స్వరా భాస్కర్. ఇదిలా ఉంటే తాజాగా తమ ఫస్ట్ నైట్​కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. దీంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. హనీమూన్ బెడ్​ను తన తల్లి గులాబీలతో అలంకరించిందంటూ ఆ పోస్టును ఫ్యాన్స్​తో పంచుకుంది. ఈ సందర్భంగా తమ లవ్​స్టోరీ ఎలా మొదలైందో చెబుతూ ఒక వీడియోను షేర్ చేసింది.

‘మేం ప్రేమ కోసం, ఎదురుచూశాం. కానీ, ముందుగా స్నేహాన్ని కనుగొన్నాం. ఆ తర్వాత ఒకరి గురించి మరొకరం తెలుసుకున్నాం. నా గుండె చప్పుడు ఫహద్ జిరార్ అహ్మద్ కు స్వాగతం’ అని ఈ సందర్భంగా తమ పడకగది ఫొటోలను పంచుకుంది స్వర. దీంతో ఈ ఫొటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొందరు స్వర- ఫహద్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తుండగా మరికొందరు మాత్రం తెగ ట్రోల్ చేస్తున్నారు. ఎలాంటి ఫొటోలు షేర్‌ చేయాలో కూడా తెలియదా అంటూ బాలీవుడ్‌ నటిపై మండిపడుతున్నారు. బెడ్ రూమ్ రహస్యాలు బయట పెడితే ఎలా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Swara Bhasker (@reallyswara)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్