IND vs AUS: ‘సిరాజ్‌ భయ్యా.. నువ్వు సూపర్’.. మ్యాచ్‌ ఓడినా అభిమానుల మనసులు గెల్చుకున్న హైదరాబాదీ స్పీడ్‌స్టర్‌

ఇండోర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినప్పటికీ హైదరాబాదీ స్పీడ్ స్టర్ మహ్మద్ సిరాజ్ మాత్రం అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డిండ్ చేస్తున్నప్పుడు..

IND vs AUS: 'సిరాజ్‌ భయ్యా.. నువ్వు సూపర్'.. మ్యాచ్‌ ఓడినా అభిమానుల మనసులు గెల్చుకున్న హైదరాబాదీ స్పీడ్‌స్టర్‌
Mohammed Siraj
Follow us
Basha Shek

|

Updated on: Mar 03, 2023 | 7:57 PM

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. మూడోరోజు మధ్యాహ్నానికే ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. టీమిండియా నిర్దేశించిన 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. తద్వారా 4 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని 2-1 కి తగ్గించింది. కాగా ఇండోర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినప్పటికీ హైదరాబాదీ స్పీడ్ స్టర్ మహ్మద్ సిరాజ్ మాత్రం అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డిండ్  చేస్తున్నప్పుడు అ భిమానులు సిరాజ్ భాయ్ అంటూ కేకలు పెట్టారు. ఈ క్రమంలోనే అందులోంచి ఓ అభిమాని దాహంగా ఉంది తాగడానికి ఎనర్జీ డ్రింక్ ఇవ్వమని గట్టిగా అరిచాడు. ఆ అభిమాని మాటలు విన్న సిరాజ్ పక్కనే ఉన్న సిబ్బంది దగ్గర తాను తాగడానికి ఉంచుకున్న డ్రింక్ ను సదరు అభిమానికి ఇచ్చాడు. దీంతో అభిమానులు ఇంకా గట్టిగా అరిచేస్తూ స్టేడియాన్ని హోరెత్తించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు సిరాజ్ చేసిన పనికి ఫిదా అవుతున్నారు. ‘నువ్వు సూపర్ భయ్యా’ అంటూ హైదరాబాదీ పేసర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా గత కొంత కాలంగా వన్డేల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు మహ్మద్‌ సిరాజ్‌. తన పదునైన పేస్‌ బౌలింగ్‌తో వరల్డ్ నంబర్ వన్ బౌలర్ గా ఎదిగాడు. అయితే ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మాత్రం అంతంతమాత్రమే రాణిస్తున్నాడు. దీనికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పిచ్‌లు పూర్తిగా స్పిన్ కు అనుకూలిస్తుండటంతో ఈ పేసర్ తేలిపోతున్నాడు. సిరీస్‌లోని చివరి మ్యాచ్ మార్చి 9 నుంచి 13 వరకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలుపొందాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..