అప్పుడు విరాట్‌ కోహ్లీకి పెళ్లి ప్రపోజల్‌.. ఇప్పుడేమో ప్రియురాలితో ఎంగేజ్‌మెంట్.. షాకిచ్చిన ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌

ఇంగ్లండ్ మహిళా స్టార్‌ క్రికెటర్‌ డేనియల్ వ్యాట్ సంచలన ప్రకటన చేసింది. కొన్నేళ్ల క్రితం టీమిండియా రన్‌ మెషిన్‌ విరాట్ కోహ్లీకి 'మ్యారీ మీ' అని పెళ్లి ప్రపోజల్‌ పెట్టిన ఈ ఇంగ్లిష్‌ క్రికెటర్‌ తాజాగా తన ప్రేయసిని పరిచయం చేసింది.

అప్పుడు విరాట్‌ కోహ్లీకి పెళ్లి ప్రపోజల్‌.. ఇప్పుడేమో ప్రియురాలితో ఎంగేజ్‌మెంట్.. షాకిచ్చిన ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌
Danielle Wyatt
Follow us
Basha Shek

|

Updated on: Mar 03, 2023 | 3:52 PM

ఇంగ్లండ్ మహిళా స్టార్‌ క్రికెటర్‌ డేనియల్ వ్యాట్ సంచలన ప్రకటన చేసింది. కొన్నేళ్ల క్రితం టీమిండియా రన్‌ మెషిన్‌ విరాట్ కోహ్లీకి ‘మ్యారీ మీ’ అని పెళ్లి ప్రపోజల్‌ పెట్టిన ఈ ఇంగ్లిష్‌ క్రికెటర్‌ తాజాగా తన ప్రేయసిని పరిచయం చేసింది. ఇంగ్లండ్‌ మహిళల ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌​ జార్జీ హెడ్గేతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న వ్యాట్‌ తన డేటింగ్‌ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. న ప్రియురాలిని ముద్దుపెట్టుకున్న ఫొటోను షేర్‌ చేస్తూ ‘ఆమె ఎప్పటికీ నాదే’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. ఇందులో వ్యాట్‌ తన ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ను కూడా చూపించడం విశేషం. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఆటతోనే కాకుండా తమ రిలేషన్‌షిప్‌తోనూ నిత్యం వార్తల్లో నిలస్తున్నారు ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్లు. కొన్నేళ్ల ముందు ఇంగ్లాండ్ క్రికెటర్ సారా టేలర్, డయాన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంది. ఇటీవలే వాళ్లిద్దరూ ఒక బిడ్డకు జన్మనివ్వనున్నట్లు కూడా అనౌన్స్ చేశారు. దీంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఒక్కసారిగా అవాక్కయ్యారు. తాజాగా డేనియల్‌ వ్యాట్‌ కూడా అమ్మాయిని నిశ్చితార్థం చేసుకుని షాక్‌ ఇచ్చింది.

కాగా క్రికెటర్ డేనియల్ వ్యాట్ గతంలో విరాట్‌ కోహ్లీని పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టింది. 2014లో జరిగిన ఈ విషయాన్ని కపిల్ శర్మ షోలో కోహ్లీ చెప్పుకొచ్చాడు. అయితే ఆ సమంయలో కోహ్లీ బిజీగా ఉన్నందువల్ల పెద్దగా ఈ విషాయన్ని పట్టించుకోలేదు. అప్పట్లో వ్యాట్ ప్రపోజల్‌ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కూడా అయింది. ఇప్పుడామెనే ఓ మహిళతో నిశ్చితార్థం చేసుకునే సరికి కోహ్లీ ఫ్యాన్స్ అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదిలా ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్న మహిళా క్రికెటర్ల సంఖ్య పెరిగిపోతోంది. గత ఏడాది ఇంగ్లాండ్‌ క్రికెటర్లు కేథరిన్‌ బ్రంట్‌, నటాలియా సీవర్‌ వివాహం చేసుకున్నారు. అందకుముందు న్యూజిలాండ్‌ మహిళా క్రికెటర్లు అమీ సాటర్త్‌వైట్‌-తహుహు, దక్షిణాఫ్రికా క్రికెటర్లు మరిజేన్‌ కాప్‌, డాన్‌ నీకెర్క్‌ కూడా గతంలో దంపతులుగా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..