8 ఫోర్లు, 4 సిక్స్‌లు.. 175కు పైగా స్ట్రైక్‌రేట్‌తో సునామీ ఇన్నింగ్స్.. దెబ్బకు 202 పరుగుల టార్గెట్ హాంఫట్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో యంగ్ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ ఆజంఖాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇస్లామాబాద్ యునైటెడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న అతను సునామీ ఇన్నింగ్స్‌లతో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు.
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో యంగ్ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ ఆజంఖాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇస్లామాబాద్ యునైటెడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న అతను సునామీ ఇన్నింగ్స్‌లతో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. శుక్రవారం కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రెచ్చిపోయాడు యంగ్ బ్యాటర్. కేవలం 41 బంతుల్లో 72 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. 175కు పైగా స్ట్రైక్‌రేట్‌తో సాగిన ఆజంఖాన్ విధ్వంసం ముందు ప్రత్యర్థి విధించిన 202 పరుగుల టార్గెట్ మంచి నీళ్లలా కరిగిపోయింది. అతనితో పాటు ఫహీమ్ అష్రఫ్ 41 పరుగులతో రాణించడంతో ఇస్లామాబాద్ 4 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో 202 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. ఈ టోర్నీలో ఇస్లామాబాద్‌కు ఇది నాలుగో విజయం. ఆజంఖాన్ దెబ్బకు కరాచీ కెప్టెన్ ఇమాద్ వాసిమ్ (54 బంతుల్లో 92, 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) వృథా అయిపోయింది. అతని ఇన్నింగ్స్ కారణంగానే కరాచీ నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగుల భారీస్కోరు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో ఇస్లామాబాద్ 69 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది.
మున్రో 11, హేల్స్ 34, డ్యూసెన్ 22 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నారు. అయితే 7 ఓవర్లో క్రీజులోకి వచ్చిన ఆజంఖాన్ తన శైలికి తగ్గట్టుగానే వరుసగా ఫొర్లు, సిక్సర్లతో చెలరేగాడు. ఎక్కడా తడబడకుండా బంతులను నేరుగా బౌండరీకి తరలించాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును విజయ తీరాలకు చేర్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని అందుకున్నాడు. కాగా కొన్ని రోజుల క్రితం క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 42 బంతుల్లో 97 పరుగులు చేసి 3 పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు. కాగా పాక్ దిగ్గజ క్రికెటర్ మొయిన్ ఖాన్ తనయుడే ఈ ఆజంఖాన్. పాక్ జాతీయ జట్టు తరఫున కొన్ని టీ 20 మ్యాచ్‌లు ఆడినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ పీఎస్‌ఎల్‌లో మాత్రం మెరుపులు మెరిపిస్తున్నాడు.
A͛͛͛Z͛͛͛A͛͛͛M͛͛͛,͛͛͛ ͛͛͛A͛͛͛Z͛͛͛A͛͛͛M͛͛͛!͛͛͛ ͛͛͛
Pindi crowd cannot stop cheering! #SabSitarayHumaray l #HBLPSL8 I #IUvKK pic.twitter.com/wwpVcDUhv3
— PakistanSuperLeague (@thePSLt20) March 3, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..