AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anchor Rashmi: అవగాహన లేక ఆ తప్పులు చేశాను.. ఇప్పుడు పూర్తిగా మానేశా.. స్టార్‌ యాంకర్‌ రష్మీ షాకింగ్‌ కామెంట్స్

బుల్లితెరపై టీవీ షోలతో నిత్యం బిజీబిజీగా గడుపుతోంది స్టార్‌ యాంకర్‌ రష్మీ గౌతమ్‌. అదే సమయంలో సోషల్‌ మీడియలోనూ తెగ చురుగ్గా ఉంటోంది. నిత్యం ఏదో ఒక విషయంపై తన అభిప్రాయాలను పంచుకుంటూ వార్తల్లో నిలుస్తోంది.

Anchor Rashmi: అవగాహన లేక ఆ తప్పులు చేశాను.. ఇప్పుడు పూర్తిగా మానేశా.. స్టార్‌ యాంకర్‌ రష్మీ షాకింగ్‌ కామెంట్స్
Rashmi Gautam
Basha Shek
|

Updated on: Mar 03, 2023 | 8:24 PM

Share

బుల్లితెరపై టీవీ షోలతో నిత్యం బిజీబిజీగా గడుపుతోంది స్టార్‌ యాంకర్‌ రష్మీ గౌతమ్‌. అదే సమయంలో సోషల్‌ మీడియలోనూ తెగ చురుగ్గా ఉంటోంది. నిత్యం ఏదో ఒక విషయంపై తన అభిప్రాయాలను పంచుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. అయితే రష్మీ షేర్‌ చేసే పోస్టులు చాలా సార్లు తీవ్రమైన ట్రోలింగ్‌కు దారి తీశాయి. అయినా ఆమె మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇటీవల అంబర్‌ పేట వీధికుక్కల దాడిలో బాలుడు చనిపోయిన ఘటన, అలాగే నాగశౌర్య వీడియోపై స్పందించి నెటిజన్ల చేతిలో ట్రోలింగ్‌కు గురైందీ అందాల తార. ఇదిలా ఉంటే రష్మీకి జంతువులపై మక్కువ ఎక్కువ. యానిమల్‌ లవర్‌గా ఆమెకు పేరుంది. కరోనా కాలంలో ఎన్నో మూగజీవాల ఆకలి తీర్చిన మంచి మనసు ఆమెది. అలాగే ఎక్కడైనా జంతువులపై దాడులు జరిగినా, హింసించినా ఇట్టే రెస్పాండ్‌ అవుతుంది. ఈక్రమంలోనే పాల ఉత్పత్తులపై ఓ పోస్ట్‌ పెట్టి మరోసారి వార్తల్లో నిలిచింది రష్మీ. తాను డైరీ ప్రోడక్ట్స్‌ను ప్రమోట్‌ చేయడం మానేశానని ఆ పోస్ట్‌లో పేర్కొంది. దీంతో ఎప్పటిలాగానే నెటిజన్లు రియాక్ట్‌ అయ్యారు. చాలామంది ఆమె తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో మరికొందరు ఆమెను ట్రోల్‌ చేశారు. ఈ సందర్భంగా 2019లో రష్మీ ఓపెన్ చేసిన ఓ ఐస్ క్రీం పార్లర్‌ వీడియో స్క్రీన్ షాట్ ని షేర్ చేస్తూ.. ‘ఈ సెలబ్రిటీలందరూ ఇంతే.. డబ్బుల కోసం ఏమైనా చేస్తారు. తర్వాత ఇలా పోస్టులు పెడతారు’ అని నెగెటివ్‌ కామెంట్‌ పెట్టాడు.

ఈ క్రమంలో నెటిజన్స్ కామెంట్స్ పై స్పందించిన రష్మీ.. ‘అవును.. గతంలో తెలియక కొన్ని పొరపాట్లు చేశాను. కానీ.. నేను కొన్నాళ్ల నుండి పాలు తాగడం మానేశాను. పాలు తాగడం వలన నా చర్మంపై ప్రతికూల ప్రభావం పడటం నేను గమనించాను. అయితే.. ఫ్యాక్టరీలలో పాల ఉత్పత్తుల తయారీ విధానం గురించి తెలుసుకున్న తర్వాత పూర్తిగా వాటిని ప్రమోట్ చేయడం ఆపేశాను’ అని సమాధానమిచ్చింది. ప్రస్తుతం రష్మీ చేసిన ట్వీట్ సోషల్‌ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..