ఆస్ట్రేలియా తుడిచిపెట్టుకుపోయింది.! టీ20ల్లో టీమిండియాను తోపుగా నిలబెట్టిన అసలైన హీరో అతడే..
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విజయం సాధించిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వాన్ని రికీ పాంటింగ్ ప్రశంసించారు. టోర్నీలో బ్యాటింగ్‌లో రాణించకపోయినా, జట్టును విజయపథంలో నడిపించడంలో సూర్య నాయకత్వం అద్భుతమని పాంటింగ్ పేర్కొన్నారు. ఇండియన్ బిజినెస్ లీడర్ అవార్డ్స్‌లో సూర్యకుమార్ స్పోర్ట్స్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు.

ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఆస్ట్రేలియా శాసించేది. నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారి, భారత జట్టు అంటేనే రారాజు అనే స్థాయికి చేరుకుంది. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు, వాస్తవంగా నిరూపితమైంది. ఇటీవల టీ20 ప్రపంచకప్ 2026లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన టీమిండియాపై మాజీ ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి సొంత గడ్డపై కప్పు గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్ సేనను రికీ పాంటింగ్ అభినందించారు. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను పాంటింగ్ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ టోర్నీలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌పై విమర్శలు వచ్చినప్పటికీ అతని నాయకత్వ పటిమను రికీ పాంటింగ్ కొనియాడారు. “ఒక ఆటగాడిగా ఈ టోర్నీలో సూర్యకుమార్ యాదవ్‌కు అంతగా కలిసి రాలేదు. కానీ చివర్లో అతనే ప్రపంచకప్ ట్రోఫీని పట్టుకొని నిలబడ్డాడు. మైదానంలో ఆటగాళ్ళతో సూర్య ఎలా మెలిగాడు, జట్టును ఎలా నడిపించాడు అన్నది ఇక్కడ ముఖ్యం” అని పాంటింగ్ పేర్కొన్నారు.
ఒక మాజీ కెప్టెన్‌గా రికీ పాంటింగ్ తన అనుభవాన్ని పంచుకుంటూ, “మనం స్వయంగా బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కెప్టెన్సీ చేయడం సులభం. కానీ మన బ్యాటింగ్ ఫామ్ లేనప్పుడు జట్టును నడిపించడం చాలా కష్టం” అని అన్నారు. గత కొన్ని వారాలుగా సూర్యకుమార్ యాదవ్.. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లతో ఎలా మాట్లాడాడు, వారిలో ఎలా స్ఫూర్తిని నింపాడనేదే కెప్టెన్ సూర్య అసలైన నాయకత్వానికి నిదర్శనమని రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించారు. ఈ 2026 టీ20 వరల్డ్‌కప్ ఆరంభ మ్యాచ్‌లలో టీమిండియాపై పెద్దగా నమ్మకాలు లేవు. అలాంటి తరుణం నుంచి జట్టును విజేతగా నిలిపిన తీరు ఇది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కే చెందుతుందని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చారు. తాను ఫామ్‌లో లేకపోయినా సరే జట్టును ముందుండి నడిపించి విశ్వవిజేతగా నిలిపాడు. ఈ ఒక్క ఐసీసి టోర్నమెంట్‌లో మాత్రమే కాదు, తాను కెప్టెన్సీ వహించిన అన్ని సిరీస్‌లలోనూ గెలుపొందడం గత రెండేళ్లుగా ఇది మామూలు విషయం కాదని సూర్యకుమార్ నాయకత్వాన్ని పాంటింగ్ మరోసారి ప్రశంసించారు. ఇదిలా ఉండగా, ప్రతిష్టాత్మకమైన ఇండియన్ బిజినెస్ లీడర్ అవార్డ్స్(IBLA) వేదికపై అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ అవార్డుల ప్రధానోత్సవంలో ఇండియన్ హెడ్ కోచ్ గౌతం గంభీర్‌కు ఎక్సలెన్స్ ఇన్ స్పోర్ట్స్ అవార్డును అందించగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పోర్ట్స్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకున్నారు.
ఇది చదవండి: ప్రామిసరీ నోటు మీద ఈ ఒక్కటి రాస్తే.. అప్పు ఇచ్చినవాడు చనిపోయినా మీ డబ్బు వెనక్కి
