Manchu Manoj: అంగరంగ వైభవంగా మనోజ్‌- మౌనికల వివాహం.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌ మరోసారి పెళ్లిపీటలెక్కాడు. కర్నూలుకు చెందిన దివంగత రాజకీయ నాయకులు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికారెడ్డిలో మూడు ముళ్లు వేశాడు. శుక్రవారం రాత్రి వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

Manchu Manoj: అంగరంగ వైభవంగా మనోజ్‌- మౌనికల వివాహం.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
Manchu Manoj Marriage
Follow us
Basha Shek

|

Updated on: Mar 04, 2023 | 6:12 AM

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌ మరోసారి పెళ్లిపీటలెక్కాడు. కర్నూలుకు చెందిన దివంగత రాజకీయ నాయకులు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికారెడ్డిలో మూడు ముళ్లు వేశాడు. శుక్రవారం రాత్రి వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మంచు లక్ష్మీ ఇళ్లు ఈ వివాహ వేడుకకు వేదికైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మనోజ్‌- మౌనికల వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు. కాగా గత కొన్ని రోజులుగా వీరి పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ దీనిపై వీరిద్దరు ఎక్కడా స్పందించలేదు. అలాగే తమ పెళ్లి గురించి ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. అయితే శనివారం ఉదయం తన పెళ్లిపై అధికారిక ప్రకటన ఇచ్చాడు మనోజ్. ఈ సందర్భంగా తనకు కాబోయే భార్య ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు మనోజ్. కొత్త పెళ్లి కూతురిగా ముస్తాబైన మౌనిక ఫోటోను షేర్ చేస్తూ.. ఎం వెడ్స్ ఎం.. మనోజ్ వెడ్స్ మౌనిక.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

కాగా మనోజ్‌ పెళ్లి వేడుకలను దగ్గరుండి పర్యవేక్షించింది మంచు లక్ష్మీ. ఈ సందర్భంగా తనే స్వయంగా సోదరుడిని పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసింది. మంచు మనోజ్, మౌనికా రెడ్డి ఇద్దరికీ కూడా ఇది రెండో వివాహం కావడం విశేషం. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న మనోజ్..భూమా మౌనిక రెడ్డితో చాలా కాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో వీరి వివాహం గురించి అనేకసార్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.