IND vs AUS: టీమిండియా స్పీడ్‌స్టర్‌కు ధైర్యం చెప్పిన ప్రధాని మోడీ.. నీ అంకిత భావానికి హ్యాట్సాఫ్‌ ఉమేశ్‌కు లేఖ

ఇండోర్ టెస్టుకు ముందు ఉమేశ్‌ యాదవ్‌ జీవితంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అతని తండ్రి తిలక్‌ యాదవ్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా బాధపడుతున్న తిలక యాదవ్‌ ఫిబ్రవరి 22న తుదిశ్వాస విడిచారు.

IND vs AUS: టీమిండియా స్పీడ్‌స్టర్‌కు ధైర్యం చెప్పిన ప్రధాని మోడీ.. నీ అంకిత భావానికి హ్యాట్సాఫ్‌ ఉమేశ్‌కు లేఖ
Pm Modi, Umesh Yadav
Follow us
Basha Shek

|

Updated on: Mar 04, 2023 | 8:10 AM

బోర్డర్‌- గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా పరాజయం పాలైంది. ఇండోర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది భారత జట్టు. కాగా స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో ఉమేశ్‌ యాదవ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ఆసీస్‌ మొదటి ఇన్నింగ్స్‌లో మూడు కీలక వికెట్లు పడగొట్టి కంగారూలను కట్టడి చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 5 ఓవర్లు వేసిన ఉమేశ్‌ 12 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు నేలకూల్చాడు. స్టార్‌ ఆల్‌రౌండర్‌ క్యామెరూన్‌ గ్రీన్‌ను వికెట్ల ముందుకు దొరకబుచ్చుకున్న ఈ స్పీడ్‌ స్టర్‌ మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లియోన్‌లను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. కాగా ఇండోర్ టెస్టుకు ముందు ఉమేశ్‌ యాదవ్‌ జీవితంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అతని తండ్రి తిలక్‌ యాదవ్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా బాధపడుతున్న తిలక యాదవ్‌ ఫిబ్రవరి 22న తుదిశ్వాస విడిచారు. అయినా మొక్కవోని ధైర్యంతో టీమిండియాలోకి వచ్చాడు. ఇండోర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లతో సత్తా చాటాడు. తండ్రిని కోల్పోయిన పుట్టెడు దుఃఖంలోనూ అద్భుతంగా బౌలింగ్‌ చేసిన ఉమేశ్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే తండ్రి మరణంతో బాధలో ఉన్న ఉన్న టీమిండియా స్పీడ్‌స్టర్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ లేఖ రాశారు. ఈ సందర్భంగా అతనికి ధైర్యం చెప్పారు. అదే సమయంలో ఉమేశ్‌ అంకితభావంపై ప్రశంసలు కురిపించాడు.

క్రికెట్ ప్రపంచంలో ఇప్పటివరకు మీ ప్రయాణంలో మీ తండ్రి త్యాగం, అంకితభావం పెద్ద పాత్ర పోషించాయని ప్రధాని లేఖలో రాశారు. మీ ప్రతి నిర్ణయంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ మీకు అండగా నిలిచారు. కాగా తనకు ధైర్యాన్ని అందించినందుకు ప్రధాని మోడీకి ఉమేశ్‌ యాదవ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఇక సిరీస్‌లోని చివరి మ్యాచ్ మార్చి 9 నుంచి 13 వరకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలుపొందాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Umesh Yaadav (@umeshyaadav)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్