AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Patriotic Dog: జంతువులకు కూడా దేశభక్తి ఉంటుందా..? వీడియో చూస్తే ‘అవును’ అని అనకుండా ఉండలేరు..

మన దేశం గురించి ఒక చిన్న విషయం తెలుసుకోవడం కూడా మన మనస్సులో ఉత్తేజకరమైన అనుభూతిని కలిగిస్తుంది. అది మనలోని దేశభక్తికి ప్రతీక. అయితే జంతువులకు కూడా దేశభక్తి ఉంటుందా..?

Patriotic Dog: జంతువులకు కూడా దేశభక్తి ఉంటుందా..? వీడియో చూస్తే ‘అవును’ అని అనకుండా ఉండలేరు..
Patriotic Dog
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 04, 2023 | 8:15 AM

Share

దేశభక్తి.. పుట్టిన దేశాన్ని ప్రేమించడం, గౌరవించడాన్ని దేశభక్తిగా చెబుతుంటారు. ఇంకా మన దేశం గురించి ఒక చిన్న విషయం తెలుసుకోవడం కూడా మన మనస్సులో ఉత్తేజకరమైన అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఈ దేశభక్తి మనుషుల విషయంలోనే వర్తింపచేస్తారు. మరి జంతువులకు కూడా దేశభక్తి ఉంటుందా..? ఈ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? లేదా ఇదేం పిచ్చి ప్రశ్న..? అని నవ్వుకుంటున్నారా..? కానీ మీరు నమ్మలేని విషయం ఏమిటంటే.. జంతువులకు కూడా దేశభక్తి ఉంటుంది. నమ్మలేరా..? అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ కుక్క వీడియోను మీరు తప్పక చూసి తీరాలి. ఆ వీడియోలో ఒక కుక్క పలు దేశాల మ్యాప్‌లు ఉన్న చిత్రపటాలను దాటుకుని వచ్చి, సరిగ్గా మన దేశం ఉన్న చిత్రపటం వద్ద సాగిలపడి నమస్కరించింది. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

parvatayyahiremat అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోలో మనం ఈ దృశ్యాలను చూడవచ్చు. ముందుగా ఒక వ్యక్తి ఆ కుక్కను భారత్ సహా పలు దేశాల మ్యాప్‌లు ఉన్న చిత్రపటాల వద్ద విడిచిపెడతాడు. ఆ క్రమంలో ఈ కుక్క పాకిస్థాన్, ఇంగ్లాండ్, జర్మనీ వంటి దేశాల చిత్రపటాలను దాటుకుంటూ.. ఆ తర్వాత ఉన్న భారత మ్యాప్ వద్ద సాగిలపడి భరతమాతకు నమస్కరించింది. ఇలా ఆ కుక్క దేశం పట్ల తన దేశభక్తిని ప్రకటించుకుంది. ఇక దీనికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు.. ఆ మూగ జీవాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇంకా ‘జై హింద్, భారతీయుడిగా గర్వపడుతున్నాను’ అంటూ కామెంట్లు చేస్తూ తమ స్పందనను తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి.. 

కాగా, ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 1 కోటి 95 లక్షలకు పైగా మంది వీక్షించారు. అలాగే 45 లక్షల 35 వేల లైకులు కూడా వచ్చాయి. అలాగే ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్ సెక్షన్‌లో తమ తమ అభిప్రాయాలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ‘జంతువులను చూసి మనం ఇంకా చాలా నేర్చుకోవాలి’ అని కామెంట్ చేయగా.. మరొకరు ‘మూగ జీవాలకు కూడా దేశభక్తి ఉంది. మనలోని కొందరు సిగ్గుపడాల్సిందే’ అంటూ రాసుకొచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..