Andhra Pradesh: ఏపీలో కొత్తగా మరో 6 మండలాల ఏర్పాటు.. నోటిఫికేషన్ జారీ చేసిన జగన్ సర్కార్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. విజయనగరం, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, ఒంగోలు జిల్లా..

Andhra Pradesh: ఏపీలో కొత్తగా మరో 6 మండలాల ఏర్పాటు.. నోటిఫికేషన్ జారీ చేసిన జగన్ సర్కార్..!
Ap Cm Jagan
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 02, 2023 | 6:03 AM

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 6 మండలాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు జిల్లా కేంద్రాలను రెండు మండలాలుగా విడదీస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. విజయనగరం, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, ఒంగోలు జిల్లా కేంద్రాలను అర్బన్‌, రూరల్‌ మండలాలుగా విభజించింది. అలాగే మచిలీపట్నంను సౌత్‌, నార్త్‌ మండలాలుగా విభజించనున్నట్లు పేర్కొంది. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొన్ని వార్డులు, శివారు గ్రామాలను కలుపుకొని సౌత్, నార్త్ మండలాలుగా విభజించింది.

మరోవైపు మచిలీపట్నంలోని 1 నుంచి 19 వరకు వార్డులను కలుపుకొని సౌత్ మండలంగా, శివార్లలోని గ్రామాలను విలీనం చేస్తూ నార్త్ మండలంగా గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మండలాల విభజనపై అభ్యంతరాలుంటే తెలపాలని ప్రభుత్వం కోరింది. నెల రోజుల్లోగా అభ్యంతరాలను కలెక్టర్‌కు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. రెవెన్యూ, ఇతర పరిపాలన సౌలభ్యం కోసం అర్బన్, రూరల్ మండలాలుగా విభజించింది.

కాగా ఇప్పుడున్న పరిధులే కొత్త మండలాల్లోనూ కొనసాగుతాయి. అందులో ఎలాంటి మార్పులు చేయలేదు. రెవెన్యూ పరంగా మరింత సుపరిపాలన అందించడంలో భాగంగా ఈ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆయా జిల్లా కేంద్రాల్లో పెరుగుతున్న పట్టణీకరణ, శివారు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?