Vijayapriya Nithyananda: ఎవరీ విజయప్రియ నిత్యానంద..? ‘కైలాసం’ ప్రతినిధిగా ఐరాసలో ప్రసంగించిన ఆమె వివరాలివే..!
ఆమె పూర్తిగా హిందుత్వం ఉట్టిపడేలా నుదిటిన పెద్ద బొట్టు, దుస్తులు, వింతగా ఉన్న తలపాగా, భారీ ఆభరణాలను ధరించి ఐరాసలో ప్రసంగించారు. ఇది చూసిన..
జెనీవాలోని ఐక్యరాజ్యసమితి సమావేశానికి కల్పిత దేశం కైలాస దేశ ప్రతినిధి హాజరయ్యారు. అత్యాచార నిందితుడు, స్వయం ప్రకటిత దైవం నిత్యానంద స్థాపించిన కాల్పనిక దేశం కైలాస ప్రతినిధి UN సమావేశానికి హాజరవడం అందరిని ఆశ్చర్యానకిి గురి చేసింది. ఈ సమావేశంలో భారత్‌పై విషం చిమ్మదుకు దొరికి అన్ని అవకాశాలను వినియోగించుకుంది. నిత్యానంద ‘హిందూమతంలో అత్యున్నత గురువు’ అని కైలాస దేశ ప్రతినిధి విజయప్రియ తెలిపారు. నిత్యానందకు భద్రత కల్పించాలని ఐక్యరాజ్యసమితి సమావేశంలో డిమాండ్ చేశారు. ఇంకా ఈ సమయంలో ఆమె పూర్తిగా హిందుత్వం ఉట్టిపడేలా నుదిటిన పెద్ద బొట్టు, దుస్తులు, వింతగా ఉన్న తలపాగా, భారీ ఆభరణాలను ధరించి ఐరాసలో ప్రసంగించారు. ఇది చూసిన వాళ్లంతా షాక్‌కు గురయ్యారు. అసలు ఆమె ఎవరు..? అంటూ గూగుల్‌లో కూడా తెగ సెర్చ్ చేస్తున్నారు.
ముందుగా చెప్పుకున్నట్లుగానే ఆమె పేరు విజయప్రియ నిత్యానంద. విజయప్రియ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. ఆమె కెనడాలోని మనిటోబా యూనివర్శిటీ నుంచి మైక్రోబయాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. మెరుగైన విద్యార్థిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. కాలేజీలో ఉత్తమ ప్రతిభను కనబరిచినందుకు డీన్ ఆనర్ జాబితాలో ఆమె పేరును కూడా చేర్చారు. 2013, 2014 సంవత్సరాల్లో ఆమె ఇంటర్నేషనల్ యూజీ స్టూడెంట్ స్కాలర్ షిప్ ను సాధించారు. ఇంగ్లీష్, ఫ్రెంచ్, పెజిన్స్, క్రియోల్ భాషలను ఆమె అనర్గళంగా మాట్లాడగలరు. అయితే ఆమె ఏ దేశానికి చెందినవారనే అంశంలో మాత్రం స్పష్టత లేదు.
విజయప్రియ నిత్యానంద ఐరాస ప్రసంగం..
Wild Cult Swami #Nithyananda Takes His Island Nation #Kailasa To UN In #Geneva#Shorts #UnitedNations #UnitedStatesOfKailasa #Swami #HWNews #Hindu #Nation #Country #Saint #Godman #UN #USK #ViralVideo #SocialMedia #Reels #Trending pic.twitter.com/whw1ZHgxFn
— HW News English (@HWNewsEnglish) March 1, 2023
ఆమె ప్రసంగాన్ని ఐక్యరాజ్యసమితి తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. తన ప్రసంగంలో భారత్‌పై విజయప్రియ నిత్యానంద తీవ్ర ఆరోపణలు చేశారు. హిందువుల కోసం ఏర్పాటైన తొలి సార్వభౌమ దేశం కైలాస దేశమని ఆమె తెలిపారు. ఈ దేశాన్ని ఏర్పాటు చేసిన నిత్యానంద హిందూ సంప్రదాయాలను, నాగరికతను పునరుద్ధరిస్తున్నారని చెప్పారు. నిత్యానందను భారత ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఈక్వెడార్ తీరానికి దగ్గర్లో ఒక ద్వీపాన్ని కొనుగోలు చేసిన నిత్యానంద దాన్ని కైలాస దేశంగా ప్రకటించారు. అయితే, కైలాస దేశాన్ని ఐక్యరాజ్యసమితి అధకారికంగా గుర్తించిందా? లేదా? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం