POCO C55 Offer: కొత్త పోకో స్మార్ట్‌ఫోన్‌‌పై అద్దిరిపోయే ఆఫర్స్.. రూ.387 కడితే చాలు మొబైల్ మీ సొంతం..!

ఫ్లిప్‌కార్ట్ POCO C55 మోడల్‌పై పలు ఆఫర్లను అందిస్తోంది. మరి POCO కంపెనీ నుంచి వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్‌పై అందుబాటులో..

POCO C55 Offer: కొత్త పోకో స్మార్ట్‌ఫోన్‌‌పై అద్దిరిపోయే ఆఫర్స్.. రూ.387 కడితే చాలు మొబైల్ మీ సొంతం..!
Poco C55
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 02, 2023 | 6:33 AM

ప్రముఖ సెల్‌ఫోన్ తయారీ కంపెనీ పోకో(POCO) ఇటివలే తన కస్టమర్ల కోసం కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మన భారత దేశంలో విడుదల చేసింది. ఇక ఈ ఫోన్ మోడల్ పేరు POCO C55. అయితే ఈ POCO C55 స్మార్ట్‌ఫోన్ సేల్స్ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఫిబ్రవరి 28 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఫ్లిప్‌కార్ట్ POCO C55 మోడల్‌పై పలు ఆఫర్లను అందిస్తోంది. మరి POCO కంపెనీ నుంచి వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్లు.. ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు వంటి పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

భారతదేశంలో POCO C55 ధర:

ఈ POCO C55 స్మార్ట్‌ఫోన్‌ ఫారెస్ట్ గ్రీన్, పవర్ బ్లాక్, కూల్ బ్లూ అనే మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. ఇక POCO C55 మొబైల్ 4 GB RAM కలిగిన 64 GB వేరియంట్ ధర రూ.9,499. అదే సమయంలో 6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ ఉన్న మోడల్‌ను కొనుగోలు చేసేందుకు రూ.10,999 వెచ్చించాల్సి ఉంటుంది.

POCO C55 స్పెసిఫికేషన్లు:

POCO C55 సాఫ్ట్‌వేర్‌, స్క్రీన్ వివరాల గురించి చెప్పాలంటే.. ఈ ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.71-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz టచ్ శాంప్లింగ్ రేట్, 534 nits పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఇంకా ఈ ఫోన్ వేగం, మల్టీ టాస్కింగ్ కోసం MediaTek Helio G85 చిప్‌సెట్‌తో గరిష్టంగా 6 GB RAM, 64 GB వరకు స్టోరేజ్‌ని కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డ్ సహాయంతో స్టోరేజీని 1 TB వరకు పెంచుకోవచ్చు. మరో వేరియంట్‌లో 4 GB RAM,  64 GB స్టోరేజీ అందుబాటులో ఉన్నాయి. ఇక ఫొటోగ్రఫీ కోసం ఈ ఫోన్ వెనుక ప్యానెల్‌లో 50MP ప్రైమరీ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్‌తో పాటు, ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా సెన్సార్ ఉంటుంది. ఈ ఫోన్‌లో 5000 mAh బ్యాటరీతో పాటు 10W ఛార్జింగ్‌కు సపోర్ట్‌ ఇచ్చే ఛార్జర్‌ కూడా ఉంది. కనెక్టివిటీ కోసం మైక్రో-USB పోర్ట్, GPS, Wi-Fi, 4G, బ్లూటూత్ వెర్షన్ 5.1 వంటి ఫీచర్లు ఫోన్‌లో అందించారు. భద్రత కోసం ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు.

ఇవి కూడా చదవండి

Flipkart ఆఫర్లు:

మీరు ఈ POCO C55 స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేసేటప్పుడు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (PNB) క్రెడిట్ కార్డ్ లేదా ఏదైనా డెబిట్ కార్డ్ ఉపయోగిస్తే 10 శాతం (రూ.1000 వరకు) తక్షణ తగ్గింపును పొందుతారు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5% క్యాష్‌బ్యాక్ అందిస్తారు. కస్టమర్ల సౌలభ్యం కోసం నెలకు రూ.1834 నోకాస్ట్‌ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. ఇది కాకుండా ఈఎంఐ ఎంపిక కావాలంటే నెలకు రూ.387 ప్రారంభ EMIతో కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ప్రయోజనం బ్యాంక్ ఆఫ్ బరోడా 36-నెలల EMI ఎంపికతో అందుబాటులో ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..