5G Technology: ప్రపంచంలో మరెవరికీ సాధ్యం కాదు.. భారత్‌‌పై బిల్ గేట్స్ ప్రశంసల జల్లు..

భారతదేశం కంటే సమగ్రమైన డిజిటల్ ఇన్‌ఫ్రాను ఇప్పటివరకు ఏ దేశం నిర్మించలేదని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో-చైర్మెన్ బిల్ గేట్స్ పేర్కొన్నారు.

5G Technology: ప్రపంచంలో మరెవరికీ సాధ్యం కాదు.. భారత్‌‌పై బిల్ గేట్స్ ప్రశంసల జల్లు..
Ashwini Vaishnaw - Bill Gates
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 01, 2023 | 5:57 PM

భారతదేశం కంటే సమగ్రమైన డిజిటల్ ఇన్‌ఫ్రాను ఇప్పటివరకు ఏ దేశం నిర్మించలేదని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో-చైర్మెన్ బిల్ గేట్స్ పేర్కొన్నారు. ప్రపంచంలో అతి చౌకైన 5జీ నెట్‌వర్క్ మార్కెట్ భారతదేశంలోనే అందుబాటులో ఉంటుందని చెప్పేందుకు ఎలాంటి సందేహం అక్కర్లేదని కొనియాడారు. భారత్ లో పర్యటిస్తున్న బిల్ గేట్స్ పలువురు ప్రముఖులతో వరుస భేటీలు అవుతున్నారు. ఈ క్రమంలో బుధవారం భారత టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ తో జరిగిన సమావేశంలో బిల్ గేట్స్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థిరమైన ఆవిష్కరణలను నడపడంలో ప్రమాణాలు, ప్లాట్‌ఫారమ్‌ల ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన బిల్ గేట్స్.. భారత్ ఈ విషయంలో ముందంజలో ఉందని తెలిపారు. ఆవిష్కరణలు, అప్లికేషన్‌లకు చోటు కల్పించిన బలమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను భారతదేశం ఏర్పాటు చేసిందని.. ఇది అద్భుతం అంటూ బిల్ గేట్స్ ప్రశంసించారు.

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ COVID-19 తర్వాత మొదటిసారి భారతదేశాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్, వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌లను మంగళవారం కలిశారు. బుధవారం కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఐటీ పరంగా భారత్ చాలా అభివృద్ధి చెందిందని తెలిపారు. యూపీఐ, ఆధార్ లాంటి సంస్కరణల గురించి ప్రశంసలు కురిపించారు. వైద్య పరంగా తీసుకువస్తున్న సంస్కరణలు అద్భుతమంటూ కొనియాడారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..