Asin: అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి.. అందాల ఆసిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? అవాక్కవ్వాల్సిందే..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మల్లో ఆసిన్ ఒకరు. తమిళ్, తెలుగు, హిందీ సినిమాల్లో నటించిన ఆసిన్ దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది.

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మల్లో ఆసిన్ ఒకరు. తమిళ్, తెలుగు, హిందీ సినిమాల్లో నటించిన ఆసిన్ దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది. అప్పటి కుర్రకారంతా ఆసిన్ ఫోటోలను పదిలంగా దాచుకునేవారు.. అంతలా కుర్రాళ్ల మనసులు దోచేసింది ఈ వయ్యారి భామ. ఇక సూర్య నటించిన గజినీ, రవితేజ నటించిన అమ్మానాన్న ఓ తమిళ్ అమ్మాయి లాంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. గజినీ సినిమానే బాలీవుడ్ లో రీమేక్ చేయగా అందులోనూ ఆసిన్ హీరోయిన్ గా చేసింది. ఆసిన్ క్లాసికల్ డాన్సర్ అని చాలా మందికి తెలియక పోవచ్చు. అంతే కాదు ఈ అమ్మడు ఏకంగా ఎనిమిది భాషల్లో మాట్లాడగలదు. తన సినిమాలకు తానే డబ్బింగ్ కూడా చెప్పుకునేది ఈ చిన్నది. అందాల ఆసిన్ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.
ఆసిన్ ఎప్పటికప్పుడు తనతోపాటు.. తన ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా, సోషల్ మీడియాలో ఆసిన్ కు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఇప్పుడు కూడా అలానే ఉందంటూ పేర్కొంటున్నారు నెటిజన్లు.




View this post on Instagram
పెళ్లి అనంతరం సినిమాలకు పూర్తిగా దూరమైన ఆసిన్.. సోషల్ మీడియాలో తన ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం..