Chiranjeevi -Pawan Kalyan: ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌గా మెగాస్టార్ కనిపించనున్నారా..?
మెగాస్టార్ నటించిన శంకర్ దాదా సినిమాలో పాటలో అలా వచ్చి ఇలా వెళ్ళుపోయారు పవన్. అలాగే శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి అలరించారు పవన్.
మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో పవన్ కళ్యాణ్ గెస్ట్ అపిరెన్స్ ఇచ్చిన సినిమాలు ఉన్నాయి. మెగాస్టార్ ను పవర్ స్టార్ ను కలిపి చూడటానికి మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆత్రుతతో ఉంటారు. మెగాస్టార్ నటించిన శంకర్ దాదా సినిమాలో పాటలో అలా వచ్చి ఇలా వెళ్ళుపోయారు పవన్. అలాగే శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి అలరించారు పవన్. ఇదిలా ఉంటే ఇప్పుడు చిరంజీవి సినిమాలో పవన్ మరోసారి కనిపించనున్నారా .? ఇప్పుడు ఇదే వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. దాంతో మెగా ఫ్యాన్ ఆనందంలో తేలిపోతున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ భోళాశంకర్. మెహార్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. కీర్తి సురేష్ మెగాస్టార్ సిస్టర్ గా నటిస్తున్నారు. ఈ సినిమా వేదాళం మూవీకి రీమేక్ గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాలో చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా కనిపించనున్నాడని అంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సాంగ్ ను కూడా ఈ మూవీలో రీమిక్స్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది . త్వరలొనేఈ సినిమానుంచి క్రేజీ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది.