- Telugu News Photo Gallery How to increase your sperm count and keep it up, onion garlic sauce for male fertility of married men
Male Fertility: పురుషుల్లో ఆ సామర్థ్యం పెరగాలంటే ఈ చట్నీ తినాల్సిందే.. ఇక బలహీనత అనే మాటే ఉండదు..
ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది సంతానలేమి సమస్యతో బాధవడుతున్నారు. నేటికాలంలో చాలామంది పురుషులు అంగస్తంభన, తక్కువ స్పెర్మ్ కౌంట్, పేలవమైన స్పెర్మ్ నాణ్యత వంటి లైంగిక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
Updated on: Feb 19, 2023 | 5:34 PM

ప్రస్తుత కాలంలో చాలామంది అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పురుషులు, మహిళలు లైంగిక (లిబిడో-ప్రేరిత) పరమైన సమస్యలతో బాధపడుతున్నారు. అయితే అలాంటి వారు వంటగదిలో ఉండే పలు రకాల పదార్థాలతో లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని.. సైన్స్ చెబుతోంది. సహజమైన కామోద్దీపనలను ప్రయత్నించడం ద్వారా లైంగిక కోరికలను పెంచుకోవడంతోపాటు పలు సమస్యల నుంచి బయటపడొచ్చు.

అయితే, లైంగిక సమస్యల నుండి బయటపడటానికి మందులు అవసరం లేదంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇంటి నివారణల ద్వారా కూడా ఆశించిన ఫలితం పొందవచ్చంటున్నారు. నపుంసకత్వాన్ని తొలగించడానికి, మీరు ఉల్లిపాయ, వెల్లుల్లి చట్నీని తయారు చేసుకోని తింటే మంచిదంటున్నారు. ఇది వైవాహిక జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది. ఉల్లి, వెల్లుల్లి తినడం వల్ల పురుష బలం పెరిగి శారీరక బలహీనత తొలగిపోతుందని పేర్కొంటున్నారు.

Relationship Tips

చట్నీ ఎలా తయారు చేయాలి: ముందుగా ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, టొమాటోలను గ్యాస్‌పై వేయించి, ఆ తర్వాత పైన పేర్కొన్న పదార్థాలన్నింటినీ మిక్సీ గ్రైండర్‌లో వేసి గ్రైండ్ చేసి, గిన్నెలో సర్వ్ చేయాలి. దీనిని అన్నం-పప్పు లేదా రోటీతో తినవచ్చు.

Onion

వెల్లుల్లితో సంతానలేమి దూరం: వెల్లుల్లిని తీసుకోవడం వల్ల పురుషుల బలాన్ని పెంచుతుంది. ఎందుకంటే ఇందులో అల్లిసిన్ సమ్మేళనం ఉంటుంది. ఇది సిరల్లో రక్త ప్రసరణను వేగంగా పెంచి వంధ్యత్వాన్ని దూరం చేస్తుంది. దీన్ని తినడం వల్ల స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ క్వాలిటీ మెరుగవుతాయి.

ఈ చట్నీని తినడం వల్ల ఈ సమస్య నుంచి క్రమంగా బయటపడవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.





























