Viral Video: నడి సముద్రంలో వింత రూపం.. దగ్గరికెళ్ళి చూస్తే గుండె గుభేల్..

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి.

Viral Video: నడి సముద్రంలో వింత రూపం.. దగ్గరికెళ్ళి చూస్తే గుండె గుభేల్..
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 18, 2023 | 8:08 PM

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా.. సముద్రంలో జరిగిన వింత ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. సాధారణంగా సముద్రపు ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతుంటాయి. సముద్రంలో జరిగిన ఎన్నో ఆసక్తికర ఘటనలను ఇప్పటికే చాలాసార్లు మీరు కూడా చూసుంటారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి అందర్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో చూసి అందరూ అవాక్కవుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో.. సముద్రంలో ఓ వింత రూపం కనిపిస్తుంటుంది. దీన్ని చూసి అంతా షాకవుతున్నారు. ఈ క్రమంలో దాన్ని చిత్రీకరిస్తున్న వ్యక్తి.. ఆ వింత రూపం ఏంటా.. అంటూ దగ్గరికి వెళ్లాడు. ఈ క్రమంలో అది భయంకరంగా కనిపిస్తుంటుంది. అయితే, అకస్మాత్తుగా అది రూపం మార్చుకుంటుంది. బోటు దగ్గరికి వెళ్లిన తర్వాత అది ఓ భారీ తిమంగిలం.. అని అర్ధమవుతుంది. అప్పటివరకు నోరు తెరిచి ఉన్న తిమింగిలం ఒక్కసారిగా నీటిలోకి వెళ్లిపోతుంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

అయితే, అది నోరు ఆహారం తినేందుకు తెరిచిందా..? లేక నీరు తాగేందుకు తెరిచిందా అనేది అర్ధం కాలేదు. ఈ వీడియోను roam_the_oceans అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా.. వేలాది మంది వీక్షించి.. వామ్మో ఇదేంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..