- Telugu News Photo Gallery Business photos EPFO Update, Higher Pension Application Date Extended upto May 3rd, Know how members can apply
EPFO ఉద్యోగులకు అలెర్ట్.. ఎక్కువ పింఛన్ పొందేందుకు దరఖాస్తు గడువు తేదీ పొడగింపు.. పూర్తి వివరాలు..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్.. పెన్షన్ పెంపుపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కువ పెన్షన్ పొందడానికి అర్హులైన సభ్యులు దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీని పెంచింది. ఎక్కువ పింఛను కోసం దరఖాస్తు చేసుకోవడానికి మే 3 వరకు చందదారులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Updated on: Feb 27, 2023 | 1:19 PM

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్.. పెన్షన్ పెంపుపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కువ పెన్షన్ పొందడానికి అర్హులైన సభ్యులు దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీని పెంచింది. ఎక్కువ పింఛను కోసం దరఖాస్తు చేసుకోవడానికి మే 3 వరకు చందదారులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హులైన సభ్యులందరూ తమ ఉద్యోగాల యజమానులతో కలిసి మే 3, 2023 వరకు రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ యొక్క ఏకీకృత సభ్యుల పోర్టల్‌లో అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇటీవల యాక్టివేట్ చేసిన EPFO ఏకీకృత సభ్యుల పోర్టల్‌లోని URL, అధిక పెన్షన్ ఎంపికను పొందేందుకు చివరి తేదీ మార్చి 3 అనుకున్నారు.. అయితే దానిని మే 3, 2023 వరకు పెంచనున్నట్లు ఈపీఎఫ్ఓ అధికారులు తెలిపారు.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) కింద అధిక పెన్షన్ కోసం చందాదారులు, వారి యజమానులు సంయుక్తంగా దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గత వారం EPFO ఒక విధానాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే.

అంతకుముందు, సుప్రీంకోర్టు నవంబర్ 4, 2022న తన ఆదేశాలలో అర్హత ఉన్న సభ్యులందరికీ అధిక పెన్షన్‌ను ఎంచుకోవడానికి నాలుగు నెలల సమయం ఇవ్వాలని EPFOకు సూచించింది.

ఎక్కువ పెన్షన్‌ను ఎంచుకోవడానికి నాలుగు నెలల వ్యవధి గా నిర్ణయించింది. ఇది మార్చి 3, 2023తో సుప్రీం కోర్టు ఆదేశాల దృష్ట్యా ముగియాల్సి ఉంది. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అర్హులైన చందాదారులకు అధిక పెన్షన్ కోసం ఎంపికను అందించాలని EPFO తన ఫీల్డ్ ఆఫీసులను కోరింది.

డిసెంబర్ 29, 2022 నాటి EPFO సర్క్యులర్ ప్రకారం ఆర్డర్‌లోని ఆదేశాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సెప్టెంబరు 1, 2014 నాటికి, సవరించిన స్కీమ్‌ను ఎంచుకోవడానికి సుప్రీం కోర్టు మొత్తం EPS సభ్యులందరికీ ఆరు నెలల సమయం ఇచ్చింది.

ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌లో అందించిన విధంగా నెలకు రూ. 6,500 వేతన పరిమితిని 2014లో నెలకు రూ. 15,000కి సవరించారు. దీని ప్రకారం.. పింఛన్ అందించాలని సుప్రీం తీర్పునిచ్చింది. దీనికి సంబందించి ఏమైనా ఫిర్యాదులుంటే.. గ్రీవెన్స్ పోర్టల్ లో ఫిర్యాదు చేయవచ్చు.





























