- Telugu News Photo Gallery Business photos Tax Savings: Want to save tax from non investment option here are tips
Tax Savings: మీరు ఎక్కడా పెట్టుబడి పెట్టకుండా కూడా పన్ను ఆదా చేసుకోవచ్చు.. ఇలా చేస్తే సరి
ఫిబ్రవరి నెల ముగుస్తున్న కొద్దీ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయం కూడా దగ్గర పడుతోంది. అటువంటి పరిస్థితిలో ప్రజలు అనేక రకాల పన్ను ఆదా పెట్టుబడి ఆప్షన్స్ కోసం చూస్తున్నారు. మీకు ప్రత్యేక పన్ను ఆదా చిట్కాల గురించి చెబుతున్నాము. మీ పీపీఎఫ్, ఈఎల్‌ఎస్, ఇతర పొదుపు ఆప్షన్స్‌ల పరిమితి అయిపోయినట్లయితే ఇది కాకుండా, మీరు ఇతర ఆప్స్‌న్స్ ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చు.
Updated on: Feb 26, 2023 | 9:17 PM

మీరు మీ పిల్లలకు ట్యూషన్ ఫీజు చెల్లిస్తే, మీరు పన్ను ఆదా కోసం క్లెయిమ్ చేయవచ్చు. మీరు ఇద్దరు పిల్లలకు మాత్రమే ట్యూషన్ ఫీజును క్లెయిమ్ చేయవచ్చు.

మీ పిల్లలు స్కాలర్‌షిప్ పొందినట్లయితే, ఆదాయపు పన్ను సెక్షన్ 10(16) కింద మీరు స్కాలర్‌షిప్‌లో స్వీకరించిన మొత్తాన్ని పన్ను మినహాయింపు కోసం క్లెయిమ్ చేయవచ్చు.

మీరు అద్దె ఇంట్లో నివసిస్తుంటే ఆదాయపు పన్ను సెక్షన్ 80GC కింద మీరు అద్దె మొత్తంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. దీని కోసం మీరు 10BA ఫారమ్‌ను మాత్రమే పూరించాలి.

ఇది కాకుండా, మీరు ఏదైనా రాజకీయ పార్టీకి విరాళం ఇస్తే,మీరు ఆదాయపు పన్ను సెక్షన్ 80GGC కింద కూడా క్లెయిమ్ చేయవచ్చు.

ఇది కాకుండా మీరు మీ పిల్లల చదువు కోసం లేదా మీ స్వంత విద్య కోసం విద్యా రుణం తీసుకున్నట్లయితే, మీరు రుణ వడ్డీపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు.





























