Tomatoes Benefits: వేసవిలో వేడికి చెక్ పెట్టాలంటే టమాటా తినాల్సిందే.. ఇంకా ఉదయాన్నే తింటే అద్దిరిపోయే 6 ప్రయోజనాలివే..

టమాటాలను క్రమం తప్పకుండా సరైన విధంగా తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా ఉదయాన్నే..

Tomatoes Benefits: వేసవిలో వేడికి చెక్ పెట్టాలంటే టమాటా తినాల్సిందే.. ఇంకా ఉదయాన్నే తింటే అద్దిరిపోయే 6 ప్రయోజనాలివే..
Tomatoes Health Benefits
Follow us

|

Updated on: Mar 02, 2023 | 6:10 AM

రోజువారీ ఆహారంలో టమాటాల ప్రాముఖ్యత చాలా విశిష్టమైనది. మనలో ఏ ఒక్కరు కూడా ఒక రోజు తిన్న కూరగాయలను అదే వారంలో తినడానికి ఇష్టపడరు. కానీ టమాటాల పరిస్థితి ఏమిటంటే.. అవి అన్ని కూరలలోనూ భాగమే. మరి ఇంతగా మనం రోజూ తినే టమాటాలతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. టమాటాలలో ఎ, సి, కె, బి1, బి3, బి5, బి6, బి7 వంటి సహజ విటమిన్లు, కాల్షియం, ఫోలేట్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, క్రోమియం, కోలిన్, జింక్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉండడమే ఈ ప్రయోజనాలకు మూలం. టమాటాలలో ఫైటోకెమికల్స్‌లో అధికంగా ఉంటాయి. ఇక టమాటాలతో చట్నీ, కూర, సూప్, జ్యూస్, సలాడ్‌ ఇలా ఏదైనా చేసుకోవచ్చు.

అంతే కాదు టమాటాలను క్రమం తప్పకుండా సరైన విధంగా తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో టమాటాలతో చేసిన ఆహారం, జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని పలు అధ్యయనాల్లో కూడా తేలింది. ఇంకా ఈ టమాటలతో ఏయే ప్రయోజనాలు చేకూరతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. వేడి: ప్రస్తుత వేసవి కాలంలో వడదెబ్బ, వేడి చేయడం వంటి సమస్యలు శరామాములే. అయితే ఉదరంలో వేడి సమస్య వస్తే ఏమీ తినాలనిపించదు. మీకు కడుపులో వేడి, మంట సమస్య అనిపిస్తే ఉదయాన్నే ఖాళీ కడుపుతో టమాటా రసం తాగితే సమస్యకు ఉపశమనం లభిస్తుంది. అంతేకాక పొట్టలో చల్లగా కూడా ఉంటుంది. అలాగే రోజంతా మీరు మంచి అనుభూతిని పొందుతారు. టమోటాలు తినడం వల్ల రోజంతా మీ శరీరంలో శక్తి కూడా ఉంటుంది.
  2. కంటిచూపు: కళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు, కాంతిని పెంచేందుకు పచ్చి కూరగాయలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కంటి చూపును మెరుగుపర్చడానికి ఖాళీ కడుపుతో టమాటాలు తీసుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల కళ్లే కాదు చర్మ ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
  3. ఇవి కూడా చదవండి
  4. చర్మ, కేశ సంరక్షణ: టామాటాలు మన చర్మం, జుట్టుకు కూడా మంచివి. టమోటాలను మన ముఖంపై మాస్కులా ఉపయోగించవచ్చు. టమాటాల్లోని లైకోపీన్ ముఖ ప్రక్షాళనగా పనిచేసి.. చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది. టమోటాలలో విటమిన్ ఎ ఉండటం వల్ల జుట్టును దుమ్ము దూళి వంటి వాటి నుంచి రక్షిస్తుంది.
  5. దృఢమైన ఎముకలు: పచ్చి టమోటాలను ఉదయాన్నే తినడం వల్ల ఎముకలకు మంచి కలుగుతుంది. టమాటాలలో ఉన్న విటమిన్ కె, కాల్షియం, లైకోపీన్ ఎముకలను సరిచేయడానికి, బలోపేతం చేయడానికి, ఇంకా వాటి పనితనాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతాయి. టమాటా జ్యూస్ తాగడం వల్ల కూడా ఎముకలలోని కణాలను రక్షించే యాంటీఆక్సిడెంట్ల ఉనికిని గణనీయంగా పెంచుతుంది.
  6. రోగనిరోధక శక్తి: ప్రస్తుతం మానవాళిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల మధ్య చాలా మందికి రోగనిరోధక శక్తి ప్రాముఖ్యత ఏమిటో తెలిసి వచ్చింది. ఈ క్రమంలోనే చాలా మంది రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు రకరకాల పద్ధతులను అనుసరిస్తున్నారు. అయితే అలాంటివారు రోగనిరోధక శక్తిని పెంచడానికి మీరు టమాటాల నిరభ్యంతరంగా తినవచ్చు. టమాటా శరీరంలో విటమిన్ సి లోపాన్ని తీర్చడం ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అందువల్ల ఉదయాన్నే టమాటా రసం తాగడం మంచిది.
  7. బరువు నియంత్రణ: బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో రెండు గ్లాసుల టమాటా రసం తాగాలి. ఇలా చేయడం వల్ల బరువు త్వరగా తగ్గి, కొద్ది రోజుల్లోనే స్థూలకాయాన్ని దూరం చేసుకోవచ్చు. టమాటా రసం తాగడమే కాకుండా తినడం కూడా మంచిదే. దీనివల్ల చర్మ సమస్యలు కూడా దూరమై మెరుస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం..

Latest Articles