Health Tips: కరివేపాకు రసంతో బోలెడు ప్రయోజనాలు.. తీసుకోకపోతే నష్టపోయినట్లే..!

కరివేపాకు ఆకులు మన జీర్ణక్రియను మెరుగుపరచడమే కాక శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగిస్తాయి. ఇంకా మన కంటికి..

Health Tips: కరివేపాకు రసంతో బోలెడు ప్రయోజనాలు.. తీసుకోకపోతే నష్టపోయినట్లే..!
Curry Leaves Juice
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 02, 2023 | 6:45 AM

వంటి గదిలో కరివేపాకును విరివిగా వాడుతుంటారు మన భారతీయ మహిళలు. ఇంకా చెప్పుకోవాలంటే కరివేపాకు, కొత్తిమీర లేకుండా వంటలను పూర్తి చేయడం చాలా కష్టం. అయితే కొందరు కూరలు, టిఫిన్స్‌లో వచ్చే కరివేపాకును తినకుండా పక్కన పెడుతారు. వీటిని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఇక మీదట ఎవరూ అలా చేయరు. ఈ కరివేపాకు ఆకులు మన జీర్ణక్రియను మెరుగుపరచడమే కాక శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగిస్తాయి. ఇంకా మన కంటికి, గుండెకు కూడా చాలా మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. కరివేపాకును కూరలలో తినడం కష్టంగా భావించినవారు దానిని జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చని వారు వివరిస్తున్నారు. మరి అసలు ఈ కరివేసాకు ఆకుల రసం తయారీ, దానిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

తయారీ విధానం:

కరివేపాకు జ్యూస్ తయారు చేసేందుకు పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. తాజా, శుభ్రం చేసిన కరివేపాకులను మిక్సర్‌లో వేసి పేస్ట్ చేసుకోవాలి. వీలైతే కరివేపాకు ఆకులను మెత్తగా దంచినా పరవాలేదు. గ్రైండర్ లేదా మిక్సర్ లేనివారు ఒక గిన్నెలో వాటర్ పోసి కరివేపాకులను వేయాలి. గ్యాస్ మీద పెట్టి సన్నని మంట మీద 20 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఆకులు గోధుమ రంగులోకి మారాక నీటిని వడపోసి వేరుచేసుకోవాలి. అలా చేసినా మీకు కావలసిన కరివేపాకు జ్యూస్ రెడీ అవుతుంది.

కరివేపాకు జ్యూస్ వలన కలిగే ప్రయోజనాలు:

1. కరివేపాకు జ్యూస్ రెగ్యూలర్‌గా తీసుకోవడం వల్ల బాడీ డిటాక్స్ అవుతుంది.  తద్వారా కడుపులో తిప్పడం, వికారం లాంటివి సమస్యల నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

2. కొవ్వు కరిగించడంలోనూ కరివేపాకు కీలకపాత్ర పోషిస్తుంది. కొవ్వు వలన రక్తం సరఫరా జరగదు. అలాంటప్పుడు కరివేపాకు తింటే, లేదా జ్యూస్ తాగితే మీ ఆరోగ్యానికి ప్లస్ పాయింట్ అవుతుంది.

3. అతి వేగంగా తినేవారికి అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. అప్పుడు కరివేపాకు తినడం, కరివేపాకు జ్యూస్ తాగడం చేస్తే అజీర్తి సమస్య దూరం చేస్తుంది. జీర్ణక్రియ సరిగా జరిగి సమయానికి ఆకలి అవుతుంది.

5. బరువు తగ్గాలనుకునేవారు కరివేపాకు జ్యూస్ తగ్గడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అందుకు తగ్గ శారీరక శ్రమ కూడా చేయాల్సి ఉంటుంది.

6. ఇంకో ముఖ్యమైన విషయం ఎంటంటే.. కరివేపాకు తినడం, జ్యూస్ తాగడం వలన జుట్టు సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి.

7. కరివేపాకు రసాన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..