Childlessness: సంతానలేమికి దారితీస్తున్న మానసిక ఒత్తిడి.. ఇంకా ఏయే ఆంశాలు ప్రభావితం చేస్తున్నాయంటే..?

ఒత్తిడిలో ఉన్న జంటలో సంతానానికి దోహదపడే హార్మోన్స్ కూడా సక్రమంగా రిలీజ్ కావంట. అందుకే ఒత్తిడిని తరిమేయాలని..

Childlessness: సంతానలేమికి దారితీస్తున్న మానసిక ఒత్తిడి.. ఇంకా ఏయే ఆంశాలు ప్రభావితం చేస్తున్నాయంటే..?
Childlessness
Follow us

|

Updated on: Mar 02, 2023 | 6:50 AM

పిల్లలను కనాలనుకోవడం ప్రతీ జంటకు ఉండే ఓ అందమైన సాధారణ కల. అయితే ప్రస్తుతం కాలంలో పిల్లలను కనాలనే కలను నిజం చేసుకునేందుకు మానసిక ఒత్తిడి ప్రధాన ఆటంకంగా ఉంటోందని నిపుణులు చెప్తున్నారు. సంతాన సాఫల్యతపై ఇటువంటి పరిస్థితి తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఒత్తిడిలో ఉన్న జంట శృంగారంలో పాల్గొన్నప్పుడు సంతానానికి దోహదపడే హార్మోన్స్ కూడా సక్రమంగా రిలీజ్ కావంట. అందుకే ఒత్తిడిని తరిమేయాలని సూచిస్తున్నారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. సంతానం కోరుకుంటున్న ప్రతీ 10 మంది మహిళల్లో ఒకరిని సంతానలేమి సమస్య వేధిస్తోంది. గర్భధారణ సమస్యలు ఎదురవుతున్నాయి.

మరో విషయం ఏంటంటే ఓ రెండేళ్ల వరకు పిల్లలు కలుగని మహిళలు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ‘ఇక నాకు సంతానం కలగదేమో.. నలుగురు ఏమనుకుంటారు. పిల్లలు కలగకపోతే భర్త తనను వదిలేసి మరో పెళ్లి చేసుకుంటాడు’ అనే ఆలోచన మహిళలను మరింత కృంగిపోయేలా చేస్తోందని వారు పేర్కొంటున్నారు.  అలాగే కొన్ని రకాల జీవనశైలి ప్రభావాలు, ఆరోగ్య సమస్యలు కూడా సంతానలేమికి దారి తీస్తున్నాయని వివరిస్తున్నారు. ఇంకా సంతానలేమికి కారణమవుతున్న అంశాలేమిటో తప్పక తెలుసుకొని వాటిని పరిష్కరించుకోవాలి. మరి అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

శారీరక శ్రమ: ఈ రోజుల్లో శారీరక శ్రమ లేకపోవడం అనేది ఇతర అనారోగ్యాలతో పాటు సంతాన లేమికి కూడా కారణం అవుతోంది. శారీరక శ్రమ ఒత్తిడిని తగ్గించడంతోపాటు సంతానోత్పత్తి అవకాశాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి స్త్రీ పురుషులిద్దరు తగిన శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. తమ ఇండ్లలో అలాంటి శ్రమకు తగిన అవకాశం లేని వారు వ్యాయామాన్ని ఎంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

అధిక బరువు: పిల్లలు కలుగకపోవడానికి అధిక బరువు కూడా ఒక కారణంగా ఉంటోంది. స్త్రీ, పురుషులిద్దరి పైనా అధిక బరువు, ఊబకాయ సమస్యలు ప్రభావం చూపుతాయి. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గుదలకు కారణం అవుతాయి. టైమ్ పాటించకుండా ఎప్పుడు పడితే అప్పుడు అతిగా తినే అలవాటు కూడా ఊబకాయానికి, సంతానలేమి సమస్యకు దారి తీయవచ్చు. అలాగే మరీ తక్కువ తినడం, బలహీనంగా ఉండటం కూడా సంతానలేమి సమస్యకు కారణం అవుతుంది. విపరీతమైన ఆహార నియంత్రణ వల్ల ‘అనోరెక్సియా’ అనే ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది.

కెఫిన్ ప్రభావం: కాఫీలోని కెఫిన్ అనే పదార్థం అధికంగా తీసుకుంటే సంతానలేమి సమస్యకు దారి తీస్తుంది. కాబట్టి రోజుకూ 4 కప్పులకు మించి తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అంతకుమించి కాఫీ తాగే జంటల్లో సంతానం కలిగే అవకాశాలు 26 శాతం తగ్గుతాయి.

మద్యపానం: కొందరు ఒత్తిడిని తట్టుకోవడానికి డ్రింక్ చేస్తున్నామని సాకులు చెప్తుంటారు. కానీ ఆల్కహాల్ సంతానలేమి సమస్యకు ప్రధాన కారణాల్లో ఒకటి. ఒక అధ్యయనం ప్రకారం వారానికి 3 లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గడంతో పాటు మహిళల్లో అండాశయ సమస్యలు తలెత్తుతాయి.

నిద్రలేమి: దీర్ఘకాలంగా నిద్రలేమి సమస్య కూడా సంతానలేమికి కారణం అవుతుంది. కాబట్టి నిద్రకు భంగం కలిగించే వాతావరణానికి దూరంగా ఉండాలి. రాత్రి సమయాల్లో గంటలకొద్దీ ఫోన్లు, డెస్క్ టాప్‌లు చూడటం వల్ల నిద్ర పట్టదు. కాబట్టి ఒకసారి బెడ్ రూమ్‌లోకి వెళ్లాక వాటికి దూరంగా ఉండటం మంచిది. మరో విషయం ఏంటంటే నిద్రలేమి అనేది 30 శాతం మంది మహిళల్లో వంధ్యత్వానికి కారణం అవుతోందట. అంతేగాక వారిలో అండాశయ నిల్వలు తగ్గుతాయి. నైట్ షిఫ్టులలో‌ పనిచేసే స్త్రీలలో గర్భస్రావం అయ్యే అవకాశాలు 15 నుంచి 20 శాతం పెరుగతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఎవరైనా నిన్ను అవమానిస్తే ఇలా ఆన్సర్ ఇవ్వు..
ఎవరైనా నిన్ను అవమానిస్తే ఇలా ఆన్సర్ ఇవ్వు..
ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ మధ్య బహిరంగ చర్చ జరుగుతుందా?
ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ మధ్య బహిరంగ చర్చ జరుగుతుందా?
ఎన్డీఏ నుంచి బయటకు వస్తారా? చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్..
ఎన్డీఏ నుంచి బయటకు వస్తారా? చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్..
ఫ్రిజ్‌ లేకున్నా ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయొచ్చు.. ఎలాగంటే?
ఫ్రిజ్‌ లేకున్నా ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయొచ్చు.. ఎలాగంటే?
ఉదయం లేవగానే ముఖం ఉబ్బినట్లు కనిపిస్తోందా.? ఇదే కారణం..
ఉదయం లేవగానే ముఖం ఉబ్బినట్లు కనిపిస్తోందా.? ఇదే కారణం..
అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లపై 50 శాతం లిమిట్ః రాహుల్
అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లపై 50 శాతం లిమిట్ః రాహుల్
పంజాబ్‌తో చావో రేవో.. టాస్ ఓడిన ఆర్సీబీ.. స్టార్ ప్లేయర్ దూరం
పంజాబ్‌తో చావో రేవో.. టాస్ ఓడిన ఆర్సీబీ.. స్టార్ ప్లేయర్ దూరం
కిషన్ రెడ్డి విత్ పద్మవిభూషణ్ చిరంజీవి.. సంచలన ఇంటర్వ్యూ.. లైవ్..
కిషన్ రెడ్డి విత్ పద్మవిభూషణ్ చిరంజీవి.. సంచలన ఇంటర్వ్యూ.. లైవ్..
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి మరో షాక్..!
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి మరో షాక్..!
సలార్‌లో ఆ కేరక్టర్‌ చాలా స్పెషల్‌ అంటున్న పృథ్విరాజ్‌
సలార్‌లో ఆ కేరక్టర్‌ చాలా స్పెషల్‌ అంటున్న పృథ్విరాజ్‌