AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vidura Neethi: జీవితాన్ని సర్వనాశనం చేసే చెడు అలవాట్లివే.. విడిచిపెట్టకపోతే విచారించక తప్పదంటున్న విదుర..!

కృష్ణ భగవానుడికి కూడా అత్యంత ప్రీతి పాత్రుడైన విదురుడిని సంప్రదించకుండా కురు మహా రాజు దృతరాష్ట్రుడు ఎలాంటి నిర్ణయాలు చేసేవాడు కాదు. అలా..

Vidura Neethi: జీవితాన్ని సర్వనాశనం చేసే చెడు అలవాట్లివే.. విడిచిపెట్టకపోతే విచారించక తప్పదంటున్న విదుర..!
Vidura Neethi
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 02, 2023 | 5:59 AM

Share

దృతరాష్ట్రుని సోదరుడు, కురు సామ్రాజ్య ప్రధాన మంత్రి విదురుడు. సునిశిత ఆలోచనా ధోరణి, దార్శనికత కలిగిన గొప్ప మేధావి ఆయన. సరళమైన ప్రశాంత చిత్తం కలిగిన స్థిత ప్రజ్ఙత కలిగిన రాజకీయవేత్త కూడా. కృష్ణ భగవానుడికి కూడా అత్యంత ప్రీతి పాత్రుడైన విదురుడిని సంప్రదించకుండా కురు మహా రాజు దృతరాష్ట్రుడు ఎలాంటి నిర్ణయాలు చేసేవాడు కాదు. అలా ఆ క్రమంలో వారిద్దరి మధ్య సాగిన సంభాషణలే విదుర నీతిగా ప్రాచూర్యంలో ఉన్నాయి. అనేక జీవిత సత్యాలను విదురుడు దృతరాష్ట్రుడికి చెప్పినట్టుగా ప్రపంచానికి మార్గదర్శనం చేశాడు. అందులో భాగంగా జీవన విధానం, ధనం, కర్మ వంటి అనేకానేక విషయాల గురించిన వివరణలు ఇచ్చాడు. విదుర నీతిలో సంతోషకరమైన జీవితం కోసం ఎలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలో కూడా వివరించాడు. విదురుడు చెప్పిన జీవిత సత్యాలు ఎప్పుడూ ఆచరణీయాలే. కాబట్టి వాటిని వెంటనే విడిచిపెట్టాలి. లేకపోతే జీవితంలో ఎంతో కోల్పోయి దృతరాష్ట్రుడిలా విచారించక తప్పదని చెబుతోంది విదుర నీతి. మరి తప్పక విడిచి పెట్టవలసిన చెడు లక్షణాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  • ఎలాంటి స్థితిలోనూ గర్వం పనికిరాదు. తనను తాను ఇతరులకంటే ఎక్కువగా భావించే వ్యక్తి అహంకారి. అలాంటి వ్యక్తులు సాధారణంగా ఎవరికీ నచ్చరు. అందుకే అహంకారానికి దూరంగా ఉండాలి.
  • తక్కువ మాట్లాడడం ఎప్పుడూ శ్రేయస్కరం. ఎక్కువ మాట్లాడడం వల్ల తెలిసో తెలియకో తప్పులు మాట్లాడే ప్రమాదం ఉంటుంది. అందుకే అవసరానికి మించి మాట్లాడక పోవడమే మంచిది. ఈ లక్షణం మిమ్మల్ని వివాద రహితులుగా చేస్తుంది. అందుకే అతిగా మాట్లాడటం అనర్థదాయకం అని విదురనీతి సారాంశం.
  • అతిగా లేదా తరచుగా కోపం తెచ్చుకోవడం అంత మంచిది కాదు. కోపంలో మాట్లాడే మాటలకు, చేతలకు ఇతరులే కాదు స్వయంగా వారికి కూడా నష్టం జరగవచ్చు. ఆగ్రహించిన వారికి ఆయుష్షు తగ్గిపోతుందని విదుర నీతి చెబుతుంది.
  • నమ్మిన వారిని మోసం చెయ్యడం ఎప్పుడూ మంచిది కాదు. నమ్మిన వారికి ద్రోహం చెయ్యడం వల్ల మీకు మరే హాని చేసుకున్నట్టు అది మిమ్మల్నే నాశనం చేస్తుంది. నమ్మక ద్రోహం మొదటికే మోసం అని విదుర నీతి వివరిస్తుంది.
  • ఆశ అందలాన్ని అందుకునే బలాన్ని ఇస్తే అత్యాశ అధఃపాతాళానికి తోసేస్తుంది. దురాశ దుఃఖానికి చేటవుతుందని విదుర నీతి చెబుతోంది. అతిగా ఆశ పడే వ్యక్తి ఎప్పుడూ ఆనందంగా ఉండలేడు. అత్యాశ పాపాలు చేయిస్తుంది. దురాశ మిమ్మల్నే నాశనం చేస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..