AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఈ లక్షణాలు కన్పిస్తే అసలు నిర్లక్ష్యం చేయకండి.. కాలక్రమేణా ప్రాణాంతకం కాగలదు..!

శరీర అవయవాలలో కిడ్నీలు కూడా కీలకమైనవి. శరీరంలో అత్యంత ముఖ్యమైన పనిని ఇవి చేస్తుంటాయి. అదేమిటంటే.. శరీరంలోని..

Health Tips: ఈ లక్షణాలు కన్పిస్తే అసలు నిర్లక్ష్యం చేయకండి.. కాలక్రమేణా ప్రాణాంతకం కాగలదు..!
మూత్రం విసర్జించే స‌మ‌యంలో మంట లేదా నొప్పి ఉంటే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు అనుమానించాలి. అలాగే పక్కటెముకల క్రింద వైపు, వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది.
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 02, 2023 | 7:05 AM

Share

మన శరీరంలో అన్ని అవయవాలు వాటి వాటి ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. కానీ కొన్ని అవయవాల మరింతగా ప్రత్యేకమైనవి. అవి పనిచేయకపోయినా, పనితీరులో లోపం వచ్చినా మన ప్రాణాలకే ప్రమాదం. అంటువంటి శరీర అవయవాలలో కిడ్నీలు కూడా కీలకమైనవి. శరీరంలో అత్యంత ముఖ్యమైన పనిని ఇవి చేస్తుంటాయి. అదేమిటంటే.. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడం. అలా పంపకపోతే వ్యర్థాలు శరీరంలోనే మిగిలిపోతాయి. తద్వారా ఆరోగ్య సమస్యలు, కిడ్నీలో రాళ్లు వంటివి కలుగుతాయి. అయితే కిడ్నీల సమస్య ఏర్పడినప్పడు శరీరంలో కొన్ని లక్షణాలు బయటపడతాయి. వీటిని గమనించి సరైన సమయంలో చికిత్స తీసుకుంటే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. లేకపోతే కిడ్నీలు పూర్తిగా పాడైపోయి.. ప్రాణాంతకంగా మారవచ్చు. ఇక కిడ్నీల పనితీరులో లోపం వలన శరీరం చూపించే ఈ లక్షణాల ద్వారా కిడ్నీ సమస్య ఉందో లేదో పసిగట్టేందుకు వీలుంటుంది. ముఖ్యంగా చేతులు, కాళ్లకు సంబంధించిన కొన్ని రకాల లక్షణాలు మీలో కిడ్నీ సమస్యను పసిగడతాయి. మరి కిడ్నీలు పాడైతే ఎలాంటి లక్షణాలు బయటకు కన్పిస్తాయో తెలుసుకుందాం..

కిడ్నీలు పాడైతే కన్పించే లక్షణాలు:

1. కిడ్నీలు పాడైతే లేదా వాటి పని తీరు మందగిస్తే తరచూ కిడ్నీ రాళ్ల సమస్య ఏర్పడుతుంది. వాస్తవానికి యూరిన్‌లో మినరల్స్, సాల్ట్ డిపోజిట్ కారణంగా కిడ్నీలో రాళ్లు తరచూ ఏర్పడుతుంటాయి. మీ కిడ్నీలు త్వరగా డ్యామేజ్ కానున్నాయనే దానికి ఇది సంకేతం.. ఇంకా ప్రధాన లక్షణం.

2. ఎవరికైనా కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే నడుము నొప్పి, మూత్రంలో నురుగు, మూత్రం పోసేటప్పుడు మంట, మూత్రం సమయంలో నొప్పి, జ్వరం, అలసట, వాంతులు, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు స్పష్టంగా కన్పిస్తాయి.

ఇవి కూడా చదవండి

3. కిడ్నీలు పాడయితే.. కిడ్నీకి సంబంధించిన ఇతర సమస్యలకు కారణంగా కావచ్చు. శరీరం నుంచి వ్యర్ధ పదార్ధాలు బయటకు తొలగే సామర్ధ్యం తగ్గినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది.

4. కిడ్నీలు విఫలమైతే వేళ్లు, కాళ్లలో వాపు ఉంటుంది. ఛాతీలో మంట, తల తిరగడం, చర్మంపై ఎర్రటి ర్యాషెస్, దురద, శ్వాసలో ఇబ్బంది వంటి లక్షణాలు కన్పిస్తాయి.

5. మీ కాళ్లు, చేతుల్లో వాపు ఉన్నట్టు కన్పిస్తే అది కిడ్నీల డ్యామేజ్ లక్షణాల్లో ఒకటి కావచ్చు. ఈ పరిస్థితుల్లో ఆ వ్యక్తి వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. చేతులు, కాళ్లలో వాపు అనేది కిడ్నీ డ్యామేజ్ ప్రాధమిక లక్షణాల్లో ఒకటి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం..