- Telugu News Photo Gallery Cricket photos List of WPL 2023 Teams and Their Captains check here for full details
WPL 2023 Captains: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్‌లో ఆడనున్న జట్లు, వాటి నాయకురాళ్ల వివరాలివే ..
ఏ ఆటలోని జట్టునైనా నడిపించాలంటే దానికి సమర్థవంతమైన సారథి అవసరం. ఈ నేపథ్యంలోనే మరి కొన్ని రోజులలో ప్రారంభమవుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లో తమ జట్టును నడిపించేందుకు ఆయా ఫ్రాంచైజీలు సారథులను ఎన్నుకున్నాయి. మరి ఏ జట్టును ఏ మహిళా క్రికెటర్ నడిపిస్తున్నారో ఇప్పుడు చూద్దాం..
Updated on: Mar 02, 2023 | 6:30 AM

మహిళా క్రికెటర్ల కోసం తొలిసారిగా బీసీసీఐ నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా.. మొదటి సీజన్‌లో డబ్ల్యూపీఎల్ ట్రోఫీ కోసం ఐదు జట్లు తలపడనున్నాయి.

మరో రెండు రోజులలో డబ్ల్యూపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ మినహా మిగిలిన నాలుగు జట్లకు సారథులను ఆయా ఫ్రాంచైజీలు ప్రకటించాయి.

ముంబై ఇండియన్స్- హర్మన్ ప్రీత్ కౌర్(భారత్)

గుజరాత్ జెయింట్స్- బెత్ మూనీ(ఆస్ట్రేలియా)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- స్మృతీ మంధాన(భారత్)

యూపీ వారియర్స్- అలీసా హీలీ(ఆస్ట్రేలియా)

ఢిల్లీ కాపిటల్స్‌కు నాయకత్వం ఎవరు వహిస్తారనే విషయంపై ఆ జట్టు ఫ్రాంచైజీ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే టీమిండియా ప్లేయర్ జెమిమా రోడ్రిగస్ లేదా ఆస్ట్రేలియన్ క్రికెటర్ మెగ్ లాన్నింగ్‌కు ఈ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అంటే.. ఢిల్లీ కాపిటల్స్-జెమిమా రోడ్రిగస్(భారత్)/ మెగ్ లాన్నింగ్(ఆస్ట్రేలియా)




