- Telugu News Sports News Cricket news Team india spinner ravichandran ashwin as number 1 bowler in icc test rankings displaced james anderson
Team India: ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్‌కు భారీ షాక్.. వారంలోనే మారిన ప్లేస్.. నంబర్ 1 టెస్ట్ బౌలర్‌గా మనోడే..
ICC Test Rankings: భారత ఆఫ్ స్పిన్నర్ రవిచందన్ అశ్విన్ ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచ నంబర్ 1 టెస్ట్ బౌలర్‌గా నిలిచాడు.
Updated on: Mar 01, 2023 | 3:38 PM

టీం ఇండియా స్టార్ ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ ప్రపంచంలోనే నంబర్ వన్ టెస్ట్ బౌలర్‌గా నిలిచాడు. బుధవారం విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆర్ అశ్విన్ ఈ స్థానం సాధించాడు.

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్‌ను అశ్విన్ అధిగమించాడు. అండర్సన్ గత వారమే నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. అయితే, తాజా ర్యాకింగ్స్‌లో అశ్విన్ ఆయనను వెనక్కునెట్టి, అగ్రస్థానం చేరాడు.

ఆర్ అశ్విన్ 864 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. జేమ్స్ ఆండర్సన్ 859 రేటింగ్ పాయింట్లను కలిగి ఉన్నాడు. 2015లో తొలిసారిగా ఆర్ అశ్విన్ నంబర్ 1 టెస్ట్ బౌలర్ అయ్యాడు. 2016లో కూడా ఈ స్థానాన్ని దక్కించుకున్నాడు.

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అశ్విన్‌తో పాటు ఇద్దరు భారత బౌలర్లు సత్తా చాటారు. జస్ప్రీత్ బుమ్రా నాలుగో స్థానానికి, రవీంద్ర జడేజా 8వ స్థానానికి చేరుకున్నారు. ఇద్దరూ ఒక్కో స్థానం ఎగబాకారు.

టెస్ట్ ఆల్‌రౌండర్ల జాబితాలో ఆర్ అశ్విన్ నంబర్ టూలో ఉన్నాడు. అదే సమయంలో రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.




