AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: ఢిల్లీలో అరంగేట్రం.. ఇండోర్‌లో 2వ టెస్ట్.. కట్‌చేస్తే.. 5 వికెట్లతో భారత్‌కు చుక్కలు.. ఆ యువ బౌలర్ ఎవరంటే?

Matthew Kuhnemann: ఇండోర్ టెస్టులో ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమాన్ అద్భుతం చేశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.

IND vs AUS: ఢిల్లీలో అరంగేట్రం.. ఇండోర్‌లో 2వ టెస్ట్.. కట్‌చేస్తే.. 5 వికెట్లతో భారత్‌కు చుక్కలు.. ఆ యువ బౌలర్ ఎవరంటే?
Matthew Kuhnemann
Venkata Chari
|

Updated on: Mar 01, 2023 | 3:18 PM

Share

ఇండోర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 109 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా స్పిన్‌ మాథ్యూ కున్‌మాన్‌ భారత ఇన్నింగ్స్‌ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అద్భుతంగా బౌలింగ్ చేస్తూ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. స్పిన్‌ బౌలింగ్‌లో ప్రావీణ్యం సంపాదించిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌లను నిస్సహాయంగా చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఆస్ట్రేలియా వర్ధమాన స్పిన్నర్ మాథ్యూ కున్‌మాన్ గురించి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మాథ్యూ కున్మాన్ ఎవరు?

మాథ్యూ కున్మాన్ ఆస్ట్రేలియాకు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. అతను 20 సెప్టెంబర్ 1996న జన్మించాడు. ఆస్ట్రేలియా తరపున టెస్టు అరంగేట్రం చేయడానికి ముందు ఆస్ట్రేలియా ఏ, ఆస్ట్రేలియా అండర్-19 తరపున ఆడాడు. అతను దేశీయ క్రికెట్‌లో క్వీన్స్‌లాండ్‌లో భాగంగా ఉన్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా XIకి కూడా ప్రాతినిధ్యం వహించాడు. కున్మాన్ బిగ్ బాష్ లీగ్ టీమ్ బ్రిస్బేన్ హీట్ తరపున ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా తరపున నాలుగు వన్డేలు కూడా ఆడాడు. గతేడాది శ్రీలంకతో వన్డే కెరీర్‌ను ప్రారంభించాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు..

మాథ్యూ కున్‌మాన్‌కు టెస్టు క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేదు. ఢిల్లీలో జరిగిన రెండో మ్యాచ్‌లో టెస్టు కెరీర్‌ను ప్రారంభించాడు. ఈ మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇండోర్‌లో భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీయడంలో సఫలమయ్యాడు. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్‌లను అవుట్ చేశాడు. ఇది అతనికి రెండో టెస్టు మాత్రమే. తన రెండో మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి