Viral Video: మరీ ఇంత బద్దకం ఏంటి బ్రో.. క్రీజు దాటినా ఔటేనా.. చెత్త రనౌట్‌లో అగ్రస్థానం నీదే.. వీడియో
New Zealand vs England: బ్రేస్‌వెల్ రూపంలో కివీస్ జట్టు 478 పరుగులకు 7వ దెబ్బ కొట్టింది. అతను పెవిలియన్‌కు తిరిగి వచ్చిన తర్వాత, న్యూజిలాండ్ మిగిలిన 3 వికెట్లు కేవలం 5 పరుగుల వ్యవధిలో పడిపోయాయి.
ఇంగ్లండ్‌తో నాలుగో రోజు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ బ్రేస్‌వెల్ క్రీజులోకి వచ్చి, జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. కానీ, కొద్దిసేపటికే అతని బద్ధకం కారణంగా రనౌట్ అయ్యాడు. వెల్లింగ్టన్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 435 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.
దీంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 209 పరుగులకు కుప్పకూలింది. ఫాలో ఆన్ ఆడుతూ కివీస్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 483 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ అత్యధికంగా 132 పరుగులు చేశాడు. కాగా, టామ్ బ్లండెల్ 90 పరుగులు చేశాడు. విలియమ్సన్, బ్లండెల్ ఇన్నింగ్స్‌ల కంటే, తన బద్దకం కారణంగా రనౌట్ అయిన బ్రేస్‌వెల్ రనౌట్ గురించే ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి.
గాలిలో కాలు, బ్యాట్ పెట్టకుండా బద్దకం..
Michael Bracewell horrible run out.#ENGvsNZ #NZvENG pic.twitter.com/r8Yl6x1Az3
— Drink Cricket ? (@Abdullah__Neaz) February 27, 2023
బ్లండెల్ 2 ఓవర్లలో 2 పరుగులు పూర్తి చేశాడు. మూడో పరుగు కోసం చూస్తున్నాడు. మూడో పరుగు దాదాపు పూర్తయింది. కానీ, బ్రేస్‌వెల్ పొరపాటు కారణంగా, కష్టమంతా ఫలించలేదు. మూడో పరుగు కోసం చేసిన ప్రయత్నంలో బ్లండెల్ నాన్-స్ట్రైక్ ఎండ్‌కు చేరుకున్నాడు. మరోవైపు, స్ట్రైక్ ఎండ్‌లో బ్రేస్‌వెల్ క్రీజులోకి వచ్చాడు. అయినప్పటికీ, అతను రనౌట్ అయ్యాడు. నిజానికి క్రీజులోకి వచ్చినప్పటికీ అతడి బ్యాట్, కాలు రెండూ గాలిలో ఉండడంతో వికెట్ కీపర్ దీన్ని సద్వినియోగం చేసుకుని, బెయిల్స్‌ను పడగొట్టాడు. 8 పరుగుల స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరుకోవాల్సి వచ్చింది.
5 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు..
బ్రేస్‌వెల్ రూపంలో కివీస్ జట్టు 478 పరుగులకు 7వ దెబ్బ కొట్టింది. అతను పెవిలియన్‌కు తిరిగి వచ్చిన తర్వాత, న్యూజిలాండ్ మిగిలిన 3 వికెట్లు కేవలం 5 పరుగుల వ్యవధిలో పడిపోయాయి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 258 పరుగులకు సమాధానంగా ఇంగ్లిష్ జట్టు 1 వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..