Video: ఫాలోఆన్ ఆడిస్తే పంచ్ పడాల్సిందే.. కివీస్ దెబ్బకు చెత్త రికార్డుల్లో ఇంగ్లండ్.. టెస్ట్ క్రికెట్‌లో సంచలనం..
ENG vs NZ 2nd Test: ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ 1 పరుగు తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో ఇంగ్లండ్ జట్టు పేరు మీద ఇబ్బందికర రికార్డు నమోదైంది.
England vs New Zealand 2nd Test: ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లిష్ జట్టు సొంత నిర్ణయంతో ఓటమిని కొని తెచ్చుకుంది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 267 పరుగుల తేడాతో విజయం సాధించింది. అదే సమయంలో రెండో మ్యాచ్‌లో 1 పరుగు తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ ఓటమితో ఇంగ్లిష్ జట్టు పేరిట ఓ ఇబ్బందికర రికార్డు కూడా నమోదైంది.
నిజానికి ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫాలోఆన్ ఆడించిన తర్వాత ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆ తర్వాత, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌కు 209/10 మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ న్యూజిలాండ్ టీంను ఫాలో ఆన్ ఆడించాని నిర్ణయించుకుంది. దీంతో రెండవ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 483/10 పరుగులు చేసింది.
లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన ఇంగ్లండ్..
దీంతో 258 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 256/10 పరుగులు మాత్రమే చేయగలిగడంతో ఆ జట్టు ఒక్క పరుగు తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఫాలోఆన్ సమయంలో ఓటమి చవిచూసిన రెండో జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ఇంతకుముందు కూడా ఆస్ట్రేలియా ఇలాంటి ఓటమిని చవిచూసింది. మొత్తంగా 3 సార్లు ఫాలో ఆన్ చేయడం ద్వారా ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఓడిపోయింది.
Incredible scenes at the Basin Reserve. A thrilling end to the 2nd Test in Wellington ? #NZvENG pic.twitter.com/tyG7laNtdP
— BLACKCAPS (@BLACKCAPS) February 28, 2023
మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ఆస్ట్రేలియా..
1994లో సిడ్నీలో ఇంగ్లండ్‌తో టెస్టు ఆడుతున్నప్పుడు కంగారూ జట్టు ఫాలో-ఆన్ ఇచ్చింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 10 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అంతకుముందు కూడా ఇంగ్లండ్‌పై ఫాలోఆన్ ఇచ్చి ఆస్ట్రేలియా ఓడిపోయింది. 1981లో లీడ్స్‌లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో, ఆస్ట్రేలియా టీం ఇంగ్లాండ్‌ను ఫాలో ఆన్ ఆడించింది. దీంతో కంగారూ జట్టు 18 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
అదే సమయంలో 2001లో టీమిండియాతో టెస్టు మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆస్ట్రేలియా ఇలాంటి పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారత్‌కు ఫాలోఆన్ ఇవ్వడంతో భారత్ 171 పరుగుల తేడాతో కంగారూ జట్టును ఓడించింది. ఫాలో ఆన్‌లో ఓడిపోయిన ఇంగ్లండ్ ఇప్పుడు రెండో జట్టుగా నిలిచింది.