Indore Test: స్వదేశంలో టీమిండియా చెత్త రికార్డ్.. ఆస్ట్రేలియా దెబ్బకు నాలుగోసారి.. అదేంటంటే?

IND vs AUS 3rd Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 మూడో టెస్ట్ ఇండోర్‌లో జరుగుతోంది. ఇక్కడ తొలి రోజు రెండో సెషన్‌లోనే టీమిండియా ఆలౌట్ అయింది. భారత జట్టు కేవలం 109 పరుగులు మాత్రమే చేసింది.

Indore Test: స్వదేశంలో టీమిండియా చెత్త రికార్డ్..  ఆస్ట్రేలియా దెబ్బకు నాలుగోసారి.. అదేంటంటే?
Team India
Follow us
Venkata Chari

|

Updated on: Mar 01, 2023 | 2:57 PM

ఇండోర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య భారత జట్టు కేవలం 109 పరుగులకే కుప్పకూలింది. ఇప్పటి వరకు సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఆడిన టెస్టు మ్యాచ్‌ల్లో టీమిండియాకు ఇది నాలుగో అతి తక్కువ స్కోరు. గత 20 ఏళ్లలో మూడు సార్లు టీమ్ ఇండియా 109 కంటే తక్కువ స్కోరుకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో తన 53వ టెస్టు మ్యాచ్‌ను ఆడుతోంది.

ఆస్ట్రేలియాపై సొంత గడ్డలో భారత జట్టు చేసిన అతి స్పల్ప స్కోరు 104 పరుగులు. 2004లో ముంబై వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా 104 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత 2017లో పుణెలో జరిగిన టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే పరిమితం కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 107 పరుగులకు ఆలౌట్ అయింది.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 మూడో టెస్టులో మరో చెత్త రికార్డు టీమ్ ఇండియా పేరిట నమోదైంది. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కేవలం 33.2 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేయగలిగింది. స్వదేశంలో టెస్టు మ్యాచ్‌ల చరిత్రలో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు అతి తక్కువ ఓవర్లు వేసిన నాలుగోదిగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

ఇండోర్ టెస్ట్ కోసం నాగ్‌పూర్, ఢిల్లీ తరహాలో భారత జట్టు స్పిన్ ట్రాక్‌ను తయారు చేయించింది. అయితే ఇక్కడ భారత జట్టు తన సొంత ఉచ్చులో చిక్కుకుంది. మ్యాచ్ తొలి రోజు రెండో సెషన్‌లో టీమిండియా ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా స్పిన్నర్లు టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను ఎక్కువసేపు నిలువనివ్వలేదు. ఇక్కడ మాథ్యూ కుహ్నెమన్ ఐదు వికెట్లు, నాథన్ లియాన్ మూడు, టాడ్ మర్ఫీ ఒక వికెట్ పడగొట్టారు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా మూడవ టెస్ట్‌‌లో భారత ఓపెనింగ్ జోడి మొదటి వికెట్‌కు 27 పరుగులు జోడించింది. అయితే మొదటి వికెట్ పడగానే, బ్యాక్‌టు బ్యాక్ వికెట్లు కోల్పోతూనే ఉంది. 18 పరుగుల వ్యవధిలో ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లు ఔటయ్యారు. జట్టులో సగం మంది 45 పరుగుల వద్ద పెవిలియన్ చేరారు. ఆ తర్వాత లోయర్ ఆర్డర్ కొంత సేపు పోరాడినా చివర్లో భారత జట్టు 109 పరుగులు మాత్రమే చేయగలిగింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..