- Telugu News Sports News Cricket news Ind vs aus nathan lyon break shane warne record most wickets by a visiting bowler in asia after taking ravindra jadeja wicket
IND vs AUS: షేన్ వార్న్ రికార్డుకు బ్రేకులు.. ఆసియాలోనే తొలి విదేశీ బౌలర్‌గా సరికొత్త చరిత్ర..
Border-Gavaskar Trophy: ఇండోర్ టెస్టులో రవీంద్ర జడేజా వికెట్ పడగొట్ట ద్వారా నాథన్ లియాన్ భారీ రికార్డ్ నెలకొల్పాడు. ఈ క్రమంలో షేన్ వార్న్ రికార్డును బద్దలు కొట్టాడు.
Updated on: Mar 01, 2023 | 2:32 PM

ఇండోర్ టెస్టులో భారత జట్టు పేలవమైన ఆట తీరుతో స్పల్ప స్కోర్‌కే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ దెబ్బకు సమాధానం లేకుండా పోయింది. ఈ క్రమంలో షేన్ వార్న్ రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో భారత్ కేవలం 109 పరుగులకే ఆలౌట్ అయింది.

నాథన్ లియాన్ భారత బౌలర్ రవీంద్ర జడేజా వికెట్ పడగొట్టి ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన విదేశీ బౌలర్‌గా నిలిచాడు.

ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన షేన్ వార్న్ రికార్డును నాథన్ లియాన్ బద్దలు కొట్టాడు. గతంలో ఈ రికార్డు 127 వికెట్లతో వార్న్ పేరిట ఉంది. నాథన్ ఆసియాలో 128 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో నాథన్ లియాన్ మూడు వికెట్లు పడగొట్టాడు.

అంతకుముందు పుజారా వికెట్ తీసిన ఇంగ్లండ్ ఆటగాడు జేమ్స్ ఆండర్సన్‌ను నాథన్ లియాన్ సమం చేశాడు. ఇద్దరు బౌలర్లు ఇప్పటివరకు పుజారాను తలో 12 సార్లు అవుట్ చేశారు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో నాథన్ లియాన్ ఒకడిగా నిలిచాడు. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో టాప్ 5 బౌలర్లలో అతనికి చోటు దక్కింది.




