IND vs AUS: ముగిసిన తొలిరోజు ఆట.. బౌలింగ్‌లో కుహ్నెమన్‌, బ్యాటింగ్‌లో ఖవాజా జోరు.. ఆసీస్‌దే ఆధిపత్యం..

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 47 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

IND vs AUS: ముగిసిన తొలిరోజు ఆట.. బౌలింగ్‌లో కుహ్నెమన్‌, బ్యాటింగ్‌లో ఖవాజా జోరు.. ఆసీస్‌దే ఆధిపత్యం..
Ind Vs Aus 3rd Test
Follow us
Venkata Chari

|

Updated on: Mar 01, 2023 | 5:02 PM

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు తొలిరోజు ఆటలో కంగారూలదే ఆధిపత్యంగా నిలిచింది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 47 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

గ్రీన్ 6, పీటర్ హ్యాండ్స్‌కాంబ్ 7 పరుగులతో క్రీజులో నిలిచారు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (60 పరుగులు) కెరీర్‌లో 21వ అర్ధ సెంచరీని నమోదు చేయగా, స్టీవ్ స్మిత్ 26 పరుగుల వద్ద ఔటయ్యాడు. 12 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియాకు ఖవాజా-లాబుషెన్‌లు బలమైన ఆరంభాన్ని అందించారు . వీరిద్దరి మధ్య 198 బంతుల్లో 96 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.

ఇవి కూడా చదవండి

భారత్ తరపున రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్లు సాధించాడు. 500+ వికెట్లు తీసిన 7వ భారత బౌలర్‌గా నిలిచాడు.

109 పరుగులకే పరిమితమైన టీమ్‌ఇండియా..

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లి జట్టులో అత్యధికంగా 22 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ స్థానంలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 21 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ కేఎస్ భరత్, ఉమేష్ యాదవ్ తలో 17 పరుగులు చేశారు. అదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ, అక్షర్ పటేల్ చెరో 12 పరుగులు మాత్రమే జోడించగలిగారు. మిగతా బ్యాట్స్‌మెన్‌లు ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు.

ఆస్ట్రేలియా తరపున మాథ్యూ కుహ్నెమన్ 5 వికెట్లు తీశాడు. నాథన్ లియోన్ 3, టాడ్ మర్ఫీలో 1 వికెట్ పడగొట్టారు.

ఇరు జట్ల ప్లేయింగ్ 11..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, పీటర్ హ్యాండ్‌స్కాంబ్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, మాథ్యూ కుహ్నెమాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..