Pakistan: పాకిస్థాన్‌కు భారీ షాక్.. వరుస ఓటములతో.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న స్టార్ ప్లేయర్..
Bismah Maroof: పాకిస్థాన్ మహిళల జట్టు కెప్టెన్ బిస్మా మరూఫ్ తన పదవికి రాజీనామా చేసింది. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
Pakistan Women Team Captain: పాకిస్థాన్ మహిళా జట్టుకు అనుభవజ్ఞురాలైన బిస్మా మరూఫ్ బుధవారం తన కెప్టెన్సీకి రాజీనామా చేసింది. మహిళల టీ20 ప్రపంచ కప్ 2023లో పేలవమైన ప్రదర్శన తర్వాత బిస్మా ఈ నిర్ణయం తీసుకున్నారు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ఆ జట్టు ఆడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. టోర్నీలో భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్‌లపై పాకిస్థాన్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
బిస్మా చాలా కాలం పాటు పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నారు. కానీ, ఇప్పుడు ఆమె తన పదవిని విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది. దీనిపై బిస్మా ట్వీట్ చేస్తూ, “పాకిస్థాన్ జట్టుకు నాయకత్వం వహించడం కంటే నాకు గొప్ప గౌరవం లేదు. ఇప్పుడు కొత్త కెప్టెన్‌ని మార్చే సమయం వచ్చిందని భావిస్తున్నాను. జట్టుకు యువ కెప్టెన్‌కు అన్ని విధాలుగా సహాయం చేయడానికి, మార్గనిర్దేశం చేయడానికి నేను ఎల్లప్పుడూ అండగా ఉంటాను” అంటూ ప్రకటించింది.
ప్లేయర్‌గా కొనసాగుతా..
There has been no bigger honour for me than leading the ?? team. Now, I feel that it is the right time for a transition and chance to groom a young captain. I will always be there to assist, guide and support the team and the young captain in every way. Pakistan Zindabad!
— Bismah Maroof (@maroof_bismah) March 1, 2023
బిస్మా జట్టు కెప్టెన్సీని విడిచిపెట్టింది. కానీ, ఆటగాడిగా జట్టుకి అందుబాటులో ఉంటుంది. 31 ఏళ్ల బిస్మా జట్టులో అనుభవజ్ఞురాలైన ప్లేయర్‌గా నిలిచింది. ఇటువంటి పరిస్థితిలో ఆటగాడిగా జట్టులో ఉండటం పాకిస్తాన్‌కు లాభమే. ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త కెప్టెన్ గురించి ఏలాంటి ప్రకటన చేయలేదు.
బిస్మా మరూఫ్ అంతర్జాతీయ కెరీర్..
బిస్మా తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటి వరకు మొత్తం 124 వన్డేలు, 132 టీ20 ఇంటర్నేషనల్‌లు ఆడింది. వన్డేల్లో 30.19 సగటుతో 3110 పరుగులు చేసింది. ఇందులో 18 అర్ధ సెంచరీలు సాధించింది. బౌలింగ్‌లో వన్డేల్లో 26.18 సగటుతో 44 వికెట్లు పడగొట్టింది.
టీ20 ఇంటర్నేషనల్‌లో 27.12 సగటు, 91.30 స్ట్రైక్ రేట్‌తో 2658 పరుగులు చేసింది. ఇందులో తన బ్యాట్‌తో 12 అర్ధ సెంచరీలు సాధించింది. బౌలింగ్‌లో 22.27 సగటుతో 36 వికెట్లు తీసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..