Video: ఇదేంది బ్రో.. క్యాచ్ కోసం బట్టలు విప్పేయాలా.. ఈ తొక్కలో ప్రాక్టీస్ ఏందంటూ నెటిజన్ల కామెంట్స్.. వీడియో
క్యాచ్‌లు క్రికెట్ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తాయని చెబుతుంటారు. బహుశా అందుకే అన్ని జట్లు క్యాచ్‌లను పట్టుకోవడంలో చాలా కష్టపడి ప్రాక్టీస్ చేస్తుంటాయి. అయితే, కొన్నిసార్లు ఘోరంగా విఫలం కూడా అవుతుంటారు.
క్యాచ్‌లు క్రికెట్ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తాయని చెబుతుంటారు. బహుశా అందుకే అన్ని జట్లు క్యాచ్‌లను పట్టుకోవడంలో చాలా కష్టపడి ప్రాక్టీస్ చేస్తుంటాయి. అయితే, కొన్నిసార్లు ఘోరంగా విఫలం కూడా అవుతుంటారు. దీంతో తీవ్ర విమర్శలు ఎదురవుతుంటాయి. తాజాగా ఓ క్రికెట్ జట్టు కూడా క్యాచ్‌ల కోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తుంది. అయితే, ఇందులో ఓ ఆటగాడి వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. బంగ్లాదేశ్ టూర్‌లో ఇంగ్లండ్ వన్డే జట్టు క్యాచ్‌ల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు కనిపించింది. ఇందులో ఓ ఆటగాడు తన క్యాచింగ్‌ను మెరుగుపరచుకోవడానికి ప్రత్యేకమైన ఫార్ములాను అనుసరించారు. మార్క్ వుడ్ క్యాచింగ్ ప్రాక్టీస్ సమయంలో తన బట్టలు విప్పేశాడు. మార్క్ వుడ్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వైరల్ వీడియోలో, మార్క్ వుడ్ క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. బంతి గాలిలో ఎత్తుకు వెళ్లింది. దానిని పట్టుకునేందుకు మార్క్ వుడ్ ముందుగా తన టోపీని తీసేశాడు. ఆ తర్వాత తన టీ-షర్టును తీసివేసి, చివరకు తన షార్ట్‌ను కూడా విప్పేసి, చివరకు క్యాచ్ అందుకుంటాడు.
క్యాచ్ తీసుకునే ముందు మార్క్ వుడ్ తన బట్టలు ఎందుకు విప్పాడు?
?What a way to grab a catch!#CricketTwitter #ENGvBAN pic.twitter.com/C4TQkrOqxz
— SJM?? (@SheikhM75834079) February 26, 2023
మార్క్ వుడ్ క్యాచ్ తీసుకునే ముందు తన దుస్తులు ఎందుకు విప్పాడు? అనే ప్రశ్న మొదలైంది. ఈ ఇంగ్లండ్ ఆటగాడు బంతిపై దృష్టిని పెంచేందుకు ఇలా చేశాడంట. ఈ ఆటగాడు బంతిని పట్టుకునే ముందు తన బట్టలు తీసేస్తూ.. బంతిపైనే దృష్టి ఉంచడమేనని అంటున్నారు.
మార్క్ వుడ్ ప్రాక్టీస్ ఫలించింది..
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో మార్క్ వుడ్ అద్భుత క్యాచ్ పట్టాడు. ఇదొక్కటే కాదు, బంతితో బలాన్ని ప్రదర్శిస్తూ, వుడ్ 8 ఓవర్లలో 34 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అలాగే జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మొయిన్ అలీ కూడా తలో 2 వికెట్లు తీశారు. ఇంగ్లాండ్ అత్యుత్తమ బౌలింగ్ ముందు బంగ్లాదేశ్ జట్టు కేవలం 209 పరుగులకే కుప్పకూలింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..