WPL 2023: మార్చి 4 నుంచి డబ్ల్యూపీఎల్ తొలి ఎడిషన్.. గ్రాండ్‌గా ఏర్పాట్లు.. సందడి చేయనున్న కియారా, కృతి సనన్..
మహిళల ప్రీమియర్ లీగ్ 2023 మార్చి 4 నుంచి ప్రారంభమవుతుంది. ఇది మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్. తొలి సీజన్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు బీసీసీఐ పూర్తి స్థాయిలో సన్నాహాలు ప్రారంభించింది.
మహిళల ప్రీమియర్ లీగ్ 2023 మార్చి 4 నుంచి ప్రారంభమవుతుంది. ఇది మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్. తొలి సీజన్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు బీసీసీఐ పూర్తి స్థాయిలో సన్నాహాలు ప్రారంభించింది. టోర్నమెంట్ మొదటి మ్యాచ్ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది.
ఈ మ్యాచ్‌కు ముందు, బాలీవుడ్ నటీమణులు కియారా అద్వానీ, కృతి సనన్ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో వీరిద్దరితో పాటు ప్రముఖ పంజాబీ సింగర్ ఏపీ ధిల్లాన్ కూడా తన పాటలతో అభిమానులను అలరించనున్నాడు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసి సమాచారం అందించింది. ఈ గ్రాండ్ సెలబ్రేషన్‌పై ఫ్యాన్స్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు.
మరోవైపు ఈ మెగా టీ20 లీగ్ గురించి మాట్లాడితే, దాని మొదటి సీజన్‌లో మొత్తం ఐదు జట్లు పాల్గొంటాయి. ఇందులో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ పేర్లు ఉన్నాయి. టోర్నీలో లీగ్ మ్యాచ్‌ల తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరుగుతాయి. దీని తర్వాత మార్చి 26న ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఫైనల్స్‌లోకి నేరుగా ప్రవేశం పొందుతుంది. అక్కడ ఎలిమినేటర్ విజేతతో తలపడుతుంది.
A star ⭐ studded line-up
D.Y.Patil Stadium will be set for an evening of glitz and glamour ??
?? ??? ???? the opening ceremony of #TATAWPL
Grab your tickets ? now on https://t.co/c85eyk7GTA pic.twitter.com/2dj4L8USnP
— Women’s Premier League (WPL) (@wplt20) March 1, 2023
WPL 2023 వేలంలో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా స్మృతి మంధాన నిలిచింది. ఫిబ్రవరి 13న జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ వేలంలో స్మృతి మంధాన అత్యధిక సంపాదనతో ముందంజలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 3 కోట్ల 40 లక్షలు వెచ్చించి మంధానను తమ జట్టులో చేర్చుకుంది. అయితే, రాబోయే సీజన్‌లో, భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ మంధాన ఆర్‌సీబీ జట్టుకు నాయకత్వం వహిస్తుంది. మార్చి 5న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆర్‌సీబీ తన తొలి మ్యాచ్ ఆడనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..