Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medico Preethi: ముగిసిన మెడికో ప్రీతీ అంత్యక్రియలు.. శోకసంద్రంలా మారిన గిర్ని తండా..

గత 5 రోజులుగా మృత్యువుతో పోరాడిన వరంగల్ మెడికల్ స్టూడెంట్ ప్రీతి అంత్యక్రియలు.. తన స్వగ్రామం మొద్రాయి గిర్ని తండాలో ముగిశాయి. ప్రీతి..

Medico Preethi: ముగిసిన మెడికో ప్రీతీ అంత్యక్రియలు.. శోకసంద్రంలా మారిన గిర్ని తండా..
Preethi Fuberal
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 27, 2023 | 1:29 PM

సీనియర్ల వేధింపులతో బలవన్మరణానికి పాల్పడి గత 5 రోజులుగా మృత్యువుతో పోరాడిన వరంగల్ మెడికల్ స్టూడెంట్ ప్రీతి అంత్యక్రియలు.. తన స్వగ్రామం మొద్రాయి గిర్ని తండాలో ముగిశాయి. ప్రీతి మరణంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు విలపిస్తున్నారు. అంతేకాక గిర్ని తండా అంతా కూడా ఈ రోజు శోకసంద్రంలా మారిపోయింది. కాగా,వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలో పీజీ అనస్థీషియా ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న ప్రీతి.. ఫిబ్రవరి 22న మత్తు ఇంజెక్షన్‌ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఆమెను తొలుత వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స అందించారు. ఆరోగ్యం ప్రమాదకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. తొలుత వెంటిలేటర్‌పై, అనంతరం ఎక్మోపై చికిత్స అందించారు. ఐదు రోజులు మృత్యువుతో పోరాడిన ప్రీతి చివరికి తనువు చాలించింది.

మరోవైపు ప్రీతి మరణానికి తన సీనియర్ అయిన సైఫ్ అనే వ్యక్తే ప్రధాన కారణమని ఆమె కుటుంబ సభ్యులు అరోపిస్తున్నారు. ఇంకా ప్రీతీది హత్య కాదు ఆత్మహత్య అంటూ నిందితులకు శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. అంతకముందు ప్రీతి మరణంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఫలితంగా కాకతీయ మెడికల్ కాలేజీ నిర్వాహకులు అలర్ట్ అయ్యి.. రేపు యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, ప్రీతి మృతి పట్ల తెలుగు రాష్ట్రాలలోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. ఇదే క్రమంలో నిందితులకు శిక్ష పడుతుందని తెలంగాణ ప్రభుత్వం ప్రీతి కుటుంబానికి హామీ ఇచ్చారు. ఇంకా ఆమె మరణానికి పరిహారంగా రూ.30 లక్షలు, కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఈ సుకుమారి స్పర్శతో ఆ చీర పునీతం అయింది.. మెస్మరైజ్ అనన్య..
ఈ సుకుమారి స్పర్శతో ఆ చీర పునీతం అయింది.. మెస్మరైజ్ అనన్య..
43 బంతుల్లో 0 పరుగులు 4 వికెట్లు.. దుమ్ములేపిన కోహ్లీ దోస్త్
43 బంతుల్లో 0 పరుగులు 4 వికెట్లు.. దుమ్ములేపిన కోహ్లీ దోస్త్
రూల్స్‌ మరింత కఠినం.. ఈ డీలర్లు సిమ్ కార్డులను విక్రయించలేరు!
రూల్స్‌ మరింత కఠినం.. ఈ డీలర్లు సిమ్ కార్డులను విక్రయించలేరు!
AI ఫీచర్లతో కూడిన సూపర్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. రూ.30 వేల లోపే..
AI ఫీచర్లతో కూడిన సూపర్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. రూ.30 వేల లోపే..
యష్ సినిమా ఆ విషయంలో ఫస్ట్ ప్రాజెక్ట్..
యష్ సినిమా ఆ విషయంలో ఫస్ట్ ప్రాజెక్ట్..
15 ఏళ్ల తర్వాత డబుల్ సెంచరీ.. క్రికెట్ గాడ్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్
15 ఏళ్ల తర్వాత డబుల్ సెంచరీ.. క్రికెట్ గాడ్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్
పోలీస్‌ కస్టడీకి వల్లభనేని వంశీ.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం
పోలీస్‌ కస్టడీకి వల్లభనేని వంశీ.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం
వారికి శని దోషం..ఈ పరిహారాలతో శనీశ్వరుడు శాంతించే అవకాశం..!
వారికి శని దోషం..ఈ పరిహారాలతో శనీశ్వరుడు శాంతించే అవకాశం..!
మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది..?
మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది..?
సోలో ట్రిప్ సజావుగా.. ఆడవారు మీ ప్రయాణాన్ని ఇలా ప్లాన్ చేస్కోండి
సోలో ట్రిప్ సజావుగా.. ఆడవారు మీ ప్రయాణాన్ని ఇలా ప్లాన్ చేస్కోండి