రెండుగా విడిపోతున్న చీకటి ఖండం..! ద్వీపాలుగా సోమాలియా, కెన్యా, ఇథియోపియా..!

నైరుబీ వద్ద భూ అంతర్భాగంలోని టెక్టోనిక్‌ ప్లేట్లలో వస్తున్న కదలికలు ఆఫ్రికా రెండుగా విడిపోతుందనే నమ్మకాన్ని..

రెండుగా విడిపోతున్న చీకటి ఖండం..! ద్వీపాలుగా సోమాలియా, కెన్యా, ఇథియోపియా..!
Africa Splitting Near Kenya
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 27, 2023 | 9:19 AM

 ప్రపంచంలో రెండో అతిపెద్ద ఖండమైన ఆఫ్రికా రెండు భాగాలుగా విడిపోనుందా..? ఆ ఖండంలోని కొన్ని దేశాలు రానున్న కాలంలో ద్వీపాలుగా మారిపోతాయా..? ప్రస్తుతం ఆఫ్రికా వాసులకే కాక సమీప దేశాలకు అంతుచిక్కని ప్రశ్న ఏమైనా ఉందంటే అది ఇదే. ఆఫ్రికా దేశమైన కెన్యా రాజధాని నైరోబికి చేరువలోని హైవేపై ఏర్పడిన పగుళ్లు ఈ ప్రశ్నలకు మూల బిందువుగా మారాయి. నైరుబీ వద్ద భూ అంతర్భాగంలోని టెక్టోనిక్‌ ప్లేట్లలో వస్తున్న కదలికలు ఆఫ్రికా రెండుగా విడిపోతుందనే నమ్మకాన్ని బలపరుస్తున్నాయి. అంతేకాక ఇదే క్రమంలో ఆ రెండు భాగాల మధ్య కొత్తగా ఒక మహాసముద్రం ఉద్భవించనుందని కూడా కెన్యాలోని యూనివర్సిటీ ఆఫ్‌ నైరోబీ పరిశోధకులు. ఆఫ్రికన్‌ రిఫ్ట్‌ లోయ ద్వారా కొత్త మహాసముద్రం ఏర్పడుతోందని వారు వివరించారు.

‘2005 నాటికే ఇథియోపియాలోని ఎడారుల్లో జోర్డాన్‌ నుంచి మొంజాబిక్‌ వరకూ 6400 కిలోమీటర్ల పొడవున, 35 మైళ్ల వెడల్పున ఓ భారీ చీలిక ఏర్పడింది. ఒక మహాసముద్రం ఏర్పాటుకు ఇదే నాంది’ అని వారు పేర్కొన్నారు. అయితే నైరుతీ కెన్యాలో గల రిఫ్ట్‌ వ్యాలీ వద్ద ఏర్పడిన ఈ భారీ పగులు కొన్ని మైళ్ల పాటు విస్తరించి నైరోబీ-నరోక్‌ హైవే కూడా దెబ్బతిసింది. అంతేకాదు కొన్ని ఇళ్లు సగానికి చీలిపోయాయి కూడా. ఈ పగులు కారణంగా భవిష్యత్‌లో ఆఫ్రికా రెండు ముక్కలు అవుంతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నుబియన్‌ ప్లేట్‌ నుంచి సోమాలి టెక్టానిక్‌ ప్లేట్‌ విడిపోయే క్రమంలో ఈ చీలిక జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే తి నెమ్మదిగా జరిగే ఈ ప్రక్రియ పూర్తయేందుకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందని చెప్పారు. ఇంకా సహజసిద్ధంగా జరిగుతున్న ఈ ప్రక్రియను అడ్డుకోవడం అసాధ్యమని పేర్కొన్నారు. ఇదే క్రమంలో విడిపోయే ముక్కలో ఉండే సోమాలియా, కెన్యా, ఇథియోపియాలు హిందూ మహాసముద్రంలో ద్వీపాలుగా మారుతాయని చెప్పారు. దీనివల్ల ఆఫ్రికా ఖండం చిన్నగా మారుతుందన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..