AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PSL 2023: ‘పాకిస్తాన్ సూపర్ లీగ్’లో దొంగలు.. ఏం తీసుకెళ్లారో తెలిస్తే నవ్వకుండా ఉండలేరు..

ఇదే క్రమంలో పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో దొంగలు పడ్డారు. మ్యాచ్‌ను లైవ్ టెలికాస్ట్ చేయడం కోసం ఉపయోగించే సామగ్రీని కూడా ఈ గడాఫీ స్టేడియంలో ఉంచారు. అయితే ఈ విషయం తెలిసిన కొందరు..

PSL 2023: ‘పాకిస్తాన్ సూపర్ లీగ్’లో దొంగలు.. ఏం తీసుకెళ్లారో తెలిస్తే నవ్వకుండా ఉండలేరు..
Psl League Cctv Cameras Stolen From Gaddafi Stadium
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 27, 2023 | 1:52 PM

Share

పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని ఘటన శనివారం రాత్రి జరిగింది. ఎప్పుడూ టీమిండియా మీద, లేదా భారత్ మీద పడి లేనిపోని ఆరోపణలు చేసే పాకిస్థాన్ మాజీలు తల దించుకునే పని జరిగింది. ఇంకా వివరంగా చెప్పాలంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కంటే పాకిస్థాన్ సూపర్ లీగ్ గొప్పదని, దానికే భారీ డిమాండ్ ఉందనే ఆ దేశ మాజీల వాదన తప్పయింది. ఎందుకంటే ఆ దేశంలో ప్రస్తుతం నెలకొన్న దుర్భర పరిస్థితుల మధ్య పీఎస్‌ఎల్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితులు ఉన్నాయని పలు వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో దొంగలు పడ్డారు. అవును మీరు విన్నది నూటికి నూరుపాళ్లు నిజమే. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో శనివారం ఒక వింత ఘటన చోటు చేసుకుంది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో పీఎస్ఎల్ మ్యాచ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మ్యాచ్ కోసం అక్కడ సీసీటీవీ కెమెరాలు అమర్చారు స్టేడియం నిర్వాహకులు.

అలాగే మ్యాచ్‌ను లైవ్ టెలికాస్ట్ చేయడం కోసం ఉపయోగించే సామగ్రీని కూడా ఈ గడాఫీ స్టేడియంలో ఉంచారు. అయితే ఈ విషయం తెలిసిన కొందరు ఈ సామగ్రిపై కన్నేశారు. స్టేడియంలో భద్రత కోసం పెట్టిన ఎనిమిది సెక్యూరిటీ కెమెరాలను కొందరు దొంగలు దోచుకెళ్లారు. వీళ్లు వీటిని తీసుకెళ్లడం స్టేడియం బయట ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ కెమెరాలతో పాటు మ్యాచ్‌లను లైవ్ టెలికాస్టింగ్ చేసేందుకు ఉపయోగించే రికార్డింగ్, మానిటర్‌లను కూడా దొంగలు ఎత్తుకెళ్లారని తెలుస్తోంది. ఈ వస్తువుల విలువ పదుల లక్షల్లో ఉంటుందని స్టేడియం నిర్వాహకులు పేర్కొంటున్నారు. బయట ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన వార్త ఫుటేజీలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు నిందితులు ఎవరనేది పోలీసులకు అంతు చిక్కకపోవడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న పీఎస్ఎల్ లీగులో సెక్యూరిటీ సమస్యలు చాలా సాధారణంగా మారిపోయాయి. దాదాపుగా మ్యాచులు జరుగుతున్న ప్రతి చోటా ఈ సమస్యలు తలెత్తుతుండటం గమనార్హం. దొంగలను పట్టించే సెక్యూరిటీ కెమెరాలనే దొంగలు పట్టుకెళ్లడంపై ఇప్పుడు జోక్స్ పేలుతున్నాయి. మరొక విషయం ఏంటంటే.. గడాఫీ స్టేడియంలో మ్యాచ్‌లను నిర్వహిస్తోన్నందుకు పాకిస్తాన్ సూపర్ లీగ్ నిర్వాహకులు పంజాబ్(పాకిస్తాన్) గవర్నమెంట్‌కు నయా పైసా  ఇవ్వలేదంట. ఫలితంగా పంజాబ్ ప్రభుత్వం ఈ మ్యాచ్‌లకు సెక్యూరిటీని ఇచ్చేందుకు నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..