Blood Donation: రక్తదానం మీ ఆరోగ్యానికే ప్రయోజనకరం.. దాని ఫలితాలేమిటో తెలిస్తే అస్సలు వెనకాడరు..

రక్తదానం మన శరీరానికి ఎలాంటి హాని కలిగించదు. అయితే ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఎందుకంటే అధిక శాతం

Blood Donation: రక్తదానం మీ ఆరోగ్యానికే ప్రయోజనకరం.. దాని ఫలితాలేమిటో తెలిస్తే అస్సలు వెనకాడరు..
Blood Donation Benefits
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 27, 2023 | 10:15 AM

ఈ నాటికీ చాలా మందిలో రక్తదానంపై అనేక అపోహలు ఉన్నాయి. రక్తదానం చేయడం వల్ల బలహీనతకు దారితీస్తుందని, అనేక వ్యాధులకు  చాలా మంది అనుకుంటుంటారు. అయితే రక్తదానం అనేది మనందరి సమాజ బాధ్యత. ఆసుపత్రికి వెళ్ళే ప్రతి ఏడుగురిలో ఒకరికి రక్తం అవసరమవుతుంది. కొన్నిసార్లు రక్తం దొరక్క చాలా మంది మరణిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. భారతదేశంలోనే కాదు అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా రక్తదానం చేయడానికి చాలా మంది నిరాకరిస్తున్నారు. పలు అధ్యయానాల ప్రకారం మన దేశంలో రక్తదానం చేసేందుకు  37 శాతం మంది  అర్హులు ఉన్నప్పటికీ. వారిలో  ప్రతి సంవత్సరం 10 శాతం కంటే తక్కువ మంది రక్తదానం చేస్తున్నారు.

రక్తదానం చేయడం అంటే ఓ మనిషికి జీవనదానం చేయడమే. మనం ఇచ్చే రక్తం ఆ రోజు కాకపోయిన మరో రోజు ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది. ఇంకా రక్తదానం మన శరీరానికి ఎలాంటి హాని కలిగించదు. అయితే ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఎందుకంటే అధిక శాతం మంది రక్తదానం విషయంలో అనేక అనుమానలతో ఉంటారు. కానీ రక్తదానం మనకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. మరి ఈ క్రమంలో రక్తదానం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఎవరు రక్తదానం చేయడానికి అర్హులు..?

  • 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్నవారు రక్తదానం చేయవచ్చు.
  • 45 కిలోల కంటే ఎక్కువ బరువున్న వ్యక్తులు మాత్రమే రక్తం ఇవ్వాలి. బరువు తక్కువ ఉంటే రక్తం ఇవ్వకూడదు.
  • 60 నుంచి 100 మధ్య రక్తపోటు, సాధారణ రక్తపోటు శరీర ఉష్ణోగ్రత 37.5 డిగ్రీల సెల్సియస్‌కు మించని వ్యక్తులు కూడా రక్తదానం చేయవచ్చు.
  •  తీవ్రమైన అనారోగ్యాలు లేని వ్యక్తులు రక్తదానం చేసేందుకు అర్హులు.

రక్తదానం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

  1. గుండె ఆరోగ్యం: రక్తంలోని ఐరన్‌ స్థాయిలో అదుపులో లేకపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశముందని వైద్యులు సూచిస్తుంటారు. రక్తదానం వల్ల రక్తంలోని ఐరన్‌ స్థాయి అదుపులో ఉంటుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.
  2. కాలేయం పనితీరు: మీ శరీరంలో ఐరన్‌ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు అది కాలేయ వైఫల్యం చెందడానికి దారితీస్తుంది. అలాగే ప్యాంక్రియాస్‌కు హాని కలిగించే ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే రక్తదానం చేయడం వలన ఐరన్‌ స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తంలో ఐరన్‌ సమాన స్థాయిలో ఉండడం వల్ల కాలేయం, ప్యాంక్రియాస్‌ దెబ్బతినే ప్రమాదం తగ్గుతుంది. రక్తదానం వల్ల.. కాలేయం దెబ్బతినకుండా కాపాడుకోవడంతో పాటు దాని పనితీరులో మెరుగదలను కూడా పొందవచ్చు.
  3. కొత్త రక్త కణాల ఉత్పత్తి: రక్తదానం చేయడం వల్ల.. కొత్త రక్త కణాల ఉత్పత్తి జరుగుతుంది. కొత్త రక్తం పుడుతుంది. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో రక్త కణాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందువల్ల సంవత్సరంలో ఒక్కసారైనా.. రక్తాన్ని ఇవ్వడం మంచిది.
  4. కేలరీల నియంత్రణ: అర లీటరు రక్తదానం చేయడం ద్వారా దాదాపు 650 కేలరీలు తగ్గుతాయని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధనలు చెబుతున్నాయి. బరువు ఎక్కువగా ఉన్నవారు రక్తదానం చేయడం వల్ల త్వరగా బరువును కోల్పోయి సాధారణస్థితికి వస్తారని కూడా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే బరువు తగ్గించుకోవాలని తరచూ రక్తదానం చేయడం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
  5. క్యాన్సర్‌ ముప్పు తక్కువ: రక్తదానం చేయడం వల్ల.. పెద్దప్రేగు, ఊపిరితిత్తులు, కాలేయం, గొంతు, ఊపిరితిత్తులు క్యాన్సర్‌తో బాధపడే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రక్తదానం చేసే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు: 

రక్తదానం చేసే కొన్ని వారాల ముందు సీఫుడ్‌, మాంసం, బచ్చలికూర, బీన్స్‌, చిలగడదుంపలు వంటివి తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిలు తగ్గకుండా ఉంటుంది. అలాగే రక్తదానం చేసే ముందు మీ అనారోగ్య సమస్యల్ని కూడా వైద్యులకు వివరించాలి. మీ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వైద్యుల సూచన మేరకు మీ రక్తాన్ని తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.