AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay: ‘ముమ్మాటికీ హత్యే’.. ప్రీతి మృతిపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

ఎంతో భవిష్యత్ ఉన్న ప్రీతి చనిపోవడం తన మనసును తీవ్రంగా కలిచివేసిందన్నారు బండి సంజయ్. అలాగే ప్రీతి మృతి ముమ్మాటికీ ..

Bandi Sanjay: ‘ముమ్మాటికీ హత్యే’.. ప్రీతి మృతిపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
Bandi Sanjay On Preethi Death
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 27, 2023 | 8:16 AM

Share

మెడికో ప్రీతి మృతిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేసిన ఆయన డా.ప్రీతి మరణం అత్యంత బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకున్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న ప్రీతి చనిపోవడం తన మనసును తీవ్రంగా కలిచివేసిందన్నారు బండి సంజయ్. అలాగే ప్రీతి మృతి ముమ్మాటికీ హత్యే అని అన్నారు బండి సంజయ్. ఆమె ఫిర్యాదు చేయగానే ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఇంతటి దారుణం జరిగిందన్నారు. కేసీఆర్ కేవలం ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని, చెప్పడానికి ఈ ఘటన అద్దం పడుతోందన్నారు. ప్రీతి ఆత్మహత్య ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బండి. ప్రీతి మరణానికి కారకులైన దుర్మార్గులను శిక్షించే వరకు పోరాడతామన్నారు.

అలాగే భవిష్యత్తులో ప్రీతి లాంటి అమ్మాయిలకు ఈ దుస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిదంటూ ట్వీట్ చేశారు బండి సంజయ్. ఇదే క్రమంలో ప్రీతి ఘటనపై ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదు..? గిరిజన విద్యార్థిని కాబట్టి ఏమైనా ఫరవాలేదనే స్పందించలేదా..?అని ప్రశ్నించారు.  మీరిచ్చే 10 లక్షల రూపాయల సాయం, ఆ తల్లిదండ్రుల గుండె కోత చల్లార్చుతుందా..? అని అన్నారు. కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుంటే క్రిమినల్స్ ఏం చేసినా చెల్లుతుందని ప్రీతి ఘటన నిరూపిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి

కాగా, నిన్న రాత్రి 9 గంటల సమయంలో వరంగల్ మెడికో ప్రీతి మృతి చెందని సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు ఉదయం 4.15 నిముషాలకు ప్రీతి మృతదేహానికి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పనులు పూర్తయ్యాయి. అనంతరం ఆమె మృతదేహాన్ని పోటీసులు భారీ భద్రతతో వరంగల్‌లో మొంద్రాయికి తరలించారు. అలాగే మొంద్రాయి గిర్ని తండాలో ఆమె అంతక్రియలు మరికాసేపటిలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పోలీసుల మోహరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..