- Telugu News Photo Gallery Drink Coconut water in Summer season to avoid seasonal problems suck as dehydration and skin diseases
Coconut Water: వేసవిలో కొబ్బరి నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలో.. తెలిస్తే వదిలిపెట్టలేరు..
కొబ్బరి నీళ్లలోని పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అందుకు కొబ్బరినీటిలోని పోషకాలే ప్రధాన కారణం. అయితే కొబ్బరి నీటితో కలిగే ప్రయోజనాలు వేసవి కాలంలో మరింతగా పెరుగుతాయి. మండుతున్న ఎండలలో చర్మ సంరక్షణతో పాటు ఆరోగ్య సమస్యలను అధిగమించడంలో కొబ్బరి నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి.
Updated on: Feb 27, 2023 | 7:35 AM

వేసవి ఎండలు ప్రారంభమయ్యాయి. ఈ మండుతున్న ఎండల ధాటి నుంచి మనల్ని మనం కాపాడుకోకపోతే అనేక రకాల ఆరోగ్య సమస్యలతో పాటు చర్మ సంబంధింతన వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో కొబ్బరి నీళ్లు మనకు ఎంతగానో ఉపకరిస్తాయి.

వేసవిలో అతి పెద్ద సమస్య డీహైడ్రేషన్.. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే.. రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు కొబ్బరినీళ్లు తాగడం వల్ల రోజంతా హైడ్రేట్‌గా ఉంటుంది.

వేసవిలో డీహైడ్రేషన్ వల్ల చర్మం, జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో కూడా కొబ్బరి నీరు గొప్పగా పనిచేస్తుంది. ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ, డీహైడ్రేషన్ ప్రమాదం కూడా పెరుగుతుంది.

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మధు మేహంతో బాధపడుతోన్న వారికి ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచడంలో కొబ్బరి నీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి.

వేడి వల్ల జీర్ణ సమస్యలు తీవ్రమవుతాయి. మీరు కూడా గ్యాస్, గుండెల్లో మంటతో బాధపడుతుంటే.. క్రమం తప్పకుండా కొబ్బరి నీళ్లు తాగండి. అసిడిటీ సమస్యను దూరం చేయడంలో కొబ్బరి నీరు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్, పొటాషియం ఉంటాయి. ఇవి గుండె సంరక్షణలో సహాయపడతాయి. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరినీళ్లు తాగవచ్చని సూచిస్తున్నారు పరిశోధకులు.

కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్లు తాగవచ్చు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు సాయంత్రం పూట కొబ్బరినీళ్లను తాగితే.. అందులోని పోషకాలు రాత్రంతా శరీరానికి అవసరమైన శక్తిని అందజేస్తుంది. తద్వారా శరీరానికి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే కొబ్బరి నీళ్లు తాగాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మూత్ర ద్వారా శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగిస్తుంది.

ఆర్థరైటిస్, శరీర నొప్పితో బాధపడుతుంటే, ఈ సాంప్రదాయ ఔషధం తాగడం వల్ల మీ పరిస్థితి మెరుగుపడుతుంది. కొబ్బరి పొట్టులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఆర్థరైటిస్ వల్ల వచ్చే వాపు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.




