AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medico Preethi: స్వగ్రామానికి మెడికో ప్రీతి మృతదేహం.. మరి కాసేపట్లో అంత్యక్రియలు..

ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం పనులు ముగిసిన తర్వాత అంబులెన్స్ ద్వారా వరంగల్‌కు బయలుదేరారు ఆమె కుటుంబ సభ్యులు. ఇక ఆమె..

Medico Preethi: స్వగ్రామానికి మెడికో ప్రీతి మృతదేహం.. మరి కాసేపట్లో అంత్యక్రియలు..
Doctor Preeti
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 27, 2023 | 7:12 AM

Share

కేఎంసీ పీజీ మెడికో ప్రీతి మృతితో యావత్ రాష్ట్రమంతా దిగ్భ్రాంతికి లోనైంది. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిపోవటం ప్రీతి కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజలందరినీ కలిచివేసింది. కాగా, ఈ ఉదయం 4.15  గంటలకు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం పనులు ముగిసిన తర్వాత అంబులెన్స్ ద్వారా వరంగల్‌కు బయలుదేరారు ఆమె కుటుంబ సభ్యులు. ఇక ఆమె మృతదేహం ఉన్న అంబులెన్స్‌కు భారీ పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. ఇక ప్రీతి పేరెంట్స్‌ని అంబులెన్స్‌లో కాకుండా తమ వాహనంలో ఎక్కించుకున్నారు పోలీసులు. అయితే అంబులెన్స్‌లో కేవలం ఒక అటెండర్‌తో మాత్రమే ప్రీతి మృతదేహాన్ని తరలించారు.

చివరికి అమె శరీరంతో ముందుగా బోడుప్పల్ నివాసానికికి చేరుకున్న కుటుంబ సభ్యులు.. పోలీసుల ప్లాన్ చేంజ్‌తో మొంద్రాయికి పయనమయ్యారు. అంతకముందు హైదరాబాద్ గాంధీ నుంచి ప్రీతి పుట్టిపెరిగిన ఉప్పల్‌లోని ఇంటికి తీసుకెళ్లండని ఆమె తండ్రి పోలీసులను వెడుకున్నారు. అయితే తమకు పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయని ఇంకా, అనుమతి లేదంటూ పోలీసులు వరంగల్‌కు తరలించారు. ఇక చేసేదేం లేక ప్రీతి కుటుంబ సభ్యులు అందరూ అంటే ఆమె తండ్రి, తల్లి, సిస్టర్, బ్రదర్, ఇతర కుటుంబసభ్యులు ఉప్పల్ ఇంటికి వచ్చి ,బట్టలు తీసుకుని ఉదయం 5 గంటల తరువాత వరంగల్‌కు వెళ్లారు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు ఎవరూ లేకుండానే ప్రీతి డెడ్‌బాడీతో వరంగల్‌కు పోలీసులు బయలుదేరారు. మొండ్రాయి గిర్ని తండాలో ఆమె అంతక్రియలు మరికాసేపటిలో జరగనుండడంతో ఆ ప్రాంతాన్ని పోలీసుల మోహరించారు.

ఇవి కూడా చదవండి

కాగా, ప్రీతి మృతిపై అటు మంత్రులు, రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ ప్రీతి ఎప్పటిలాగే ఆరోగ్యంగా తిరిగి వస్తుందనుకున్నామని.. కానీ ఇలా జరగటం తమను కలిచివేసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెడికో ప్రీతి మృత్యువుతో పోరాడి మరణించిన ఘటన దురదృష్టకరమన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఆమెను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమవడం బాధ కలిగిస్తుందన్నారు. ప్రీతి మరణం పట్ల సంతాపం తెలిపిన మంత్రి… ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు నిందితుడిని తీవ్రంగా శిక్షించాలిని కుటుంబ సభ్యులు డిమాండ్  చేశారు. బాధ్యులకు శిక్ష పడేలా చూస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే ఈ కేసుపై ప్రస్తుతం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరుగుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..