AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Allergy Tips: దురద, దద్దుర్లతో బాధపడుతున్నారా..? ఈ పదార్థాలను వాడారంటే సమస్యకు చెక్ పెట్టినట్లే..!

దురద తర్వాత దద్దుర్లు రావడం ప్రారంభమవుతాయి. ఇక వీటి కారణంగా చర్మ సంరక్షణ మరింత సవాలుగా మారుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో..

Skin Allergy Tips: దురద, దద్దుర్లతో బాధపడుతున్నారా..? ఈ పదార్థాలను వాడారంటే సమస్యకు చెక్ పెట్టినట్లే..!
Itch Relief Tips
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 26, 2023 | 1:00 PM

Share

మన చుట్టూ ఉన్న వాతావరణంలోని కాలుష్యం, వేడి తీవ్రత కారణంగా చాలా రకాల చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఎండా కాలంలో బిగుతుగా ఉండే దుస్తులు వేసుకోవడవం వల్ల కూడా తొడ భాగాలలో దురద, ఇతర చోట్ల అలెర్జీ సమస్యలు వస్తూ ఉంటాయి. వీటితోపాటు దురద తర్వాత దద్దుర్లు రావడం ప్రారంభమవుతాయి. ఇక వీటి కారణంగా చర్మ సంరక్షణ మరింత సవాలుగా మారుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి సమస్యలను విస్మరించడం వల్ల భవిష్యత్‌లో తీవ్ర సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు కొన్ని ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. మరి ఆ చిట్కాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ఆహారాలతో దురదకు చెక్‌:

తేనె: తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, క్రిమినాశక లక్షణాలు ఉంటాయి. అందువల్ల చర్మపు దద్దుర్లు సులభంగా తొలగిపోతాయి. అయితే దీని కోసం 2 చెంచాల తేనెలో ఒక చెంచా నీటిని మిక్స్ చేసి కాటన్‌ సహాయంతో దురద ఉన్న ప్రదేశంలో అప్లై చేయండి. తేనె ఆరిపోయిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.

కర్పూరం: పూజకు చాలా మంది కర్పూరాన్ని వినియోగిస్తూ ఉంటారు. అయితే ఇందులో చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి దీని పొడిని ప్రభావిత ప్రాంతంలో రాస్తే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి

కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో విటమిన్లు, ఖనిజాల లభిస్తాయి.అంతేకాకుండా ఇందులో యాంటీ ఫంగల్‌తో పాటు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు లభిస్తాయి. కాబట్టి  దురద, అలెర్జీలను సులభంగా తగ్గించడానికి సహాయపడతాయి.

పచ్చి కొత్తిమీర: కొత్తిమీర ఆకులను గ్రైండ్ చేసి అందులో నిమ్మరసం కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని దురద ఉన్న భాగాలపై అప్లై చేసి సుమారు 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఇలా అది ఆరిపోయిన తర్వాత నీటితో కడిగేయాలి.

అలోవెరా జెల్: అలోవెరా జెల్ చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలా మంది దీనిని వినియోగిస్తారు. అయితే ఇది సౌందర్యానికే కాకుండా చర్మ సమస్యలకు కూడా ప్రభావవంతంగా సహాయపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. అందుకోసం అలోవెరా జెల్‌తో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్‌ను కలపండి. దీన్ని దురద ఉన్న ప్రదేశంలో అప్లై చేసి ఆరిపోయే దాకా ఉంచి శుభ్రమైన నీటితో కడగాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి