Vegetables Storage Tips: ఈ కూరగాయలు, పండ్లను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా? అయితే ప్రమాదంలో పడినట్లే
కూరగాయలు, పండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉండేందుకు వాటిని ఫ్రిజ్‌లో ఉంచుతాం. అయితే అన్ని పండ్లు, కూరగాయలు ఫ్రీజర్‌లో ఉంచలేం. కొన్ని కూరగాయలు, పండ్లను శీతలీకరించడం వల్ల వాటి రుచి, ఆకృతి మారుతుంది. ఫలితంగా అవి త్వరగా పాడైపోతాయి.
కూరగాయలు, పండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉండేందుకు వాటిని ఫ్రిజ్‌లో ఉంచుతాం. అయితే అన్ని పండ్లు, కూరగాయలు ఫ్రీజర్‌లో ఉంచలేం. కొన్ని కూరగాయలు, పండ్లను శీతలీకరించడం వల్ల వాటి రుచి, ఆకృతి మారుతుంది. ఫలితంగా అవి త్వరగా పాడైపోతాయి. అలాగే కొన్ని పండ్లను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల చాలా వరకు పాడయ్యే ఛాన్స్ లేదా విషపూరితంగా మారే అవకాశం ఉంది. వీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనం కలగకపోవడంతోపాటు ఆరోగ్యానికి హాని కలుగుతుంది. మరి ఫ్రిజ్‌లో ఏయే కూరగాయలు, పండ్లను ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిది టొమాటోలు. చాలా మంది టొమాటోలను ఫ్రిజ్‌లో ఉంచడానికి ఇష్టపడతారు. అయితే చల్లని ఉష్ణోగ్రతల వద్ద టమోటాలు రుచి, ఆకృతిని కోల్పోయే అవకాశం ఉంది. టొమాటోలను ఫ్రిజ్‌లో ఉంచే బదులు గది ఉష్ణోగ్రత వద్ద బయట ఉంచడం మేలంటున్నారు నిపుణులు. అలాగే అరటిపండ్లను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. చల్లని ఉష్ణోగ్రతల వల్ల అరటి తొక్కలు నల్లగా మారడం వల్ల అవి పుల్లగా మారుతాయి. అరటిపండ్లను ఎండకు దూరంగా నీడలో నిల్వచేయాలి.
అవోకాడో
అవకాడోలు పక్వానికి వచ్చే వరకు గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచడం మంచిది. అవి పండిన తర్వాత, వాటిని కొన్ని రోజులు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయవచ్చు. కానీ పచ్చి ఆవకాయను ఫ్రిజ్‌లో ఉంచితే అది పూర్తిగా పండదు.
బంగాళదుంపలు
బంగాళదుంపలను కూడా ఫ్రిజ్‌లో నిల్వచేయకపోవడం మంచిది. వాటిని పొడి ప్రదేశంలో ఉంచాలి. మీరు బంగాళాదుంపలను శీతలీకరించినట్లయితే, వాటి ఆకృతి మారవచ్చు.
ఉల్లిపాయ
ఉల్లిపాయకు బాగా వెంటిలేషన్, చల్లగా ఉన్న పొడి ప్రదేశాల్లో నిల్వ ఉంచాలి. ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల పాడయ్యే ప్రమాదం ఉంది.
యాపిల్స్
యాపిల్స్‌ను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అవి త్వరగా పండిపోతాయి. దీని వెనుక కారణం యాపిల్‌లో కనిపించే క్రియాశీల ఎంజైమ్‌లు. కాబట్టి యాపిల్స్‌ను ఫ్రిజ్‌లో ఉంచవద్దు. మీరు ఆపిల్ పండ్లను ఎక్కువ కాలం నిల్వ ఉంచాలంటే, వాటిని కాగితంలో చుట్టి ఉంచండి. అంతే కాకుండా రేగు, చెర్రీ, పీచు వంటి విత్తనాలు ఉన్న పండ్లను కూడా ఫ్రిజ్‌లో ఉంచకూడదు.
పుచ్చకాయ
వేసవిలో ప్రజలు పుచ్చకాయను విపరీతంగా తింటారు. కానీ, ఇంత పెద్ద పండును ఒక్కసారిగా తినడం కష్టం అవుతుంది. ఇటువంటి పరిస్థితిలో పుచ్చకాయను కట్ చేసి ఫ్రిజ్‌లో ఉంచుతుంటుంటారు. ఇది చాలా తప్పు. ఎప్పుడూ పుచ్చకాయను కత్తిరించి ఫ్రిజ్‌లో ఉంచకూడదు. వీటిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి యాంటీ ఆక్సిడెంట్లు నశిస్తాయి. కాబట్టి తినడానికి ముందు మాత్రమే అది కూడా కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచవచ్చు.
మామిడి
మామిడి పండ్లను ఎప్పుడూ ఫ్రిజ్‌లో ఉంచవద్దు. దీని వల్ల మామిడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తగ్గుతాయి. దీని వల్ల మామిడిలోని పోషకాలు కూడా నశిస్తాయి. మామిడి పండ్లను కర్బైడ్‌తో ఉంచుతుంటుంటారు. దీంతో వీటిని నీటిలో కలిపితే త్వరగా పాడైపోతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..