AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Increase Breast Milk: మీ బిడ్డకు తల్లి పాలు సరిపోవడం లేదా? ఇలా చేస్తే సరిపడా పాలు వస్తాయి..!

ప్రస్తుతం కాలంలో చాలా మంది బాలింతలకు పాలు సరిగా రావడం లేదు. దాంతో పుట్టిన బిడ్డకు తల్లిపాలు అందడం లేదు. పలితంగా పిల్లలకు సరైన ఫీడింగ్ లభించకపోగా..

Increase Breast Milk: మీ బిడ్డకు తల్లి పాలు సరిపోవడం లేదా? ఇలా చేస్తే సరిపడా పాలు వస్తాయి..!
Breast Feeding
Shiva Prajapati
|

Updated on: Feb 25, 2023 | 6:32 PM

Share

ప్రస్తుతం కాలంలో చాలా మంది బాలింతలకు పాలు సరిగా రావడం లేదు. దాంతో పుట్టిన బిడ్డకు తల్లిపాలు అందడం లేదు. పలితంగా పిల్లలకు సరైన ఫీడింగ్ లభించకపోగా.. సరైన పోషకాలు అందకుండా పోతాయి. చాలా మంది పిల్లల తల్లలు ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు. అయితే, తల్లుల్లో పాలు పెరిగేందుకు వంటింటి చిట్కాలే అద్భుతంగా పని చేస్తాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. వంటింట్లో నిత్యం వినియోగించే, సహజంగా లభించే పదార్థాలతో తల్లి పాల ఉత్పత్తిని పెంచవచ్చు అని చెబుతున్నారు. వాటిలో అల్లం, మెంతులు, నల్ల మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఆవుపాలు, బాదం పప్పు, డ్రై ఫ్రూట్స్, హవిజా వంటి పదార్థాలు తల్లిపాలను పెంచుతాయని చెబుతున్నారు.

తల్లి పాలను పెంచడానికి చిట్కాలు..

అల్లం: టీ తాగే అలవాటు ఉన్నవారు అల్లం టీ తాగితే ప్రయోజనం ఉంటుంది. అలాగే, ఇతర ఆహారాలలో పొడి అల్లం ను ఉపయోగించడం వల్ల కూడా తల్లి పాలు పెరుగుతాయి.

మెంతులు: మెంతి గింజల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మెంతులతో దోసేలు వేసుకుని తినవచ్చు. అలాగే, మెంతి కూరను కూడా తినవచ్చు. దీనిని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, తల్లి పాలు పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

మిరియాలు: వంటకాల్లో రుచి, సువాన కోసం వీటిని వినియోగిస్తుంటాం. అయితే, ఇవి తల్లి పాలను పెంచడంలో సహాయపడుతాయి. బాలింతలు మిరియాల చారుతో అన్నం తినడం వల్ల పాలు పెరుగుతాయి.

జీలకర్ర: జీలకర్రతో కషాయం చేసుకుని తాగడం వల్ల బాలింతలకు పాలు ఎక్కువగా వస్తాయి. తద్వారా పిల్లలకు సరిపడా పాలు అందుతాయి. అలా కాకుండా అన్నం ద్వారా వీటిని తీసుకోవచ్చు.

వెల్లుల్లి: ఎండు కొబ్బరిని వేయించి పొడి చేసి వెల్లుల్లి, ఉప్పు, చిటికెడు పంచదార కలిపి మధ్యాహ్న భోజనంలో చిరుతిండిగా తినవచ్చు.

ఆవు పాలు: ఆవు పాలు సహజంగా తల్లి పాలను పెంచడానికి సహాయపడతాయి. ఇది మీకు కావలసిన విధంగా ఉపయోగించవచ్చు.

డ్రై ఫ్రూట్స్: బాదం, రేగు, ఎండు ద్రాక్ష, వాల్‌నట్‌లు, పిస్తాలు వంటి డ్రై ఫ్రూట్స్‌ను సరైన పరిమాణంలో వేయించి మెత్తగా చేసి నెయ్యిలో వేయించి బెల్లంతో లడ్డూలుగా చేసుకుని తినొచ్చు. శిశువుకు ఒక నెల వయస్సు వచ్చిన తర్వాత తల్లి ఈ పోషకమైన లడ్లను తినడం మంచిది. తద్వారా తల్లికి పాలు పెరుగుతాయి. అయితే, వీటిని ఎక్కువగా తినకూడదు. పిల్లల్లో జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది.

గమనిక: పైన పేర్కొన్న సమాచారాన్ని నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం పేర్కొనడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. కేవలం ప్రజల సాధారణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ఏవైనా సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించి, వారి సలహాలు, సూచనలు పాటించాలి

మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: