AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: ‘అలా చేసి ఉంటే’.. మెడికో ప్రీతి మరణంపై స్పందించిన పవన్ కళ్యాణ్..

మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచిన డాక్టర్ ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ప్రీతినీ సైఫ్ వేధిస్తూ, కించపరుస్తూ ఉన్నాడని తల్లితండ్రులు ఫిర్యాదు చేసిన

Pawan Kalyan: 'అలా చేసి ఉంటే'.. మెడికో ప్రీతి మరణంపై స్పందించిన పవన్ కళ్యాణ్..
Pawan Kalyan
Rajitha Chanti
|

Updated on: Feb 27, 2023 | 8:26 AM

Share

డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరమని అన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఐదు రోజులు మృత్యువుతో పోరాడి ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచింది ప్రీతి. భారీ బందోబస్తు మధ్య మృతదేహాన్ని ఆమె స్వగ్రామం మొండ్రాయి గిర్నీతండాకు తరలించారు పోలీసులు. ప్రీతి మరణంపై మంత్రులు, రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రీతి మృతిపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. “మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచిన డాక్టర్ ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ప్రీతినీ సైఫ్ వేధిస్తూ, కించపరుస్తూ ఉన్నాడని తల్లితండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే కాలేజీ బాధ్యులు సరైన రీతిలో స్పందించి ఉంటే ఇటువంటి దురదృష్టకర పరిస్థితి వచ్చేది కాదు. డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు కారకుడైన నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలి.

సీనియర్‌ వైద్య విద్యార్థి సైఫ్‌ వేధింపులు భరించలేక డాక్టర్‌ ప్రీతి బలవన్మరణానికి పాల్పడ్డ పరిస్థితులు, కన్నవారి మానసిక వేదన గురించి తెలుసుకొంటే హృదయం ద్రవించింది. తమ బిడ్డను సైఫ్‌ వేధిస్తూ, కించపరుస్తూ ఉన్నాడని తల్లితండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే కాలేజీ బాధ్యులు సరైన రీతిలో స్పందించి ఉంటే ఇటువంటి దురదృష్టకర పరిస్థితి వచ్చేది కాదు. డాక్టర్‌ ప్రీతి ఆత్మహత్యకు కారకుడైన నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలి. కళాశాలలో ముఖ్యంగా మెడికల్‌, ఇంజినీరింగ్‌ కళాశాలలో ర్యాగింగ్‌, వేధింపులు అరికట్టడంపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించాలి.

ఇవి కూడా చదవండి

సీనియర్‌ విద్యార్థుల ఆలోచన ధోరణి మారాలి. కొత్తగా కాలేజీలోకి అడుగుపెట్టిన వారిని స్నేహపూర్వకంగా అక్కున చేర్చుకుని తమ కుటుంబ సభ్యుల్లా ఆదరించాలి. అందుకు భిన్నంగా వేధింపులకు పాల్పడటం, ఆధిపత్య ధోరణి చూపడం రాక్షసత్వం అవుతుందని గ్రహించాలి.” అని అన్నారు పవన్ కళ్యాణ్.