Project K: ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ చిత్రంలో కీలక మార్పులు.. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్.. 

ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు సంగీత దర్శకుడిగా మిక్కీ జె మేయర్ ను అనుకున్నారు. కానీ ఆయన స్థానంలో ఇప్పుడు సంతోష్ నారాయణన్ వచ్చి చేరారు. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ అశ్వినిదత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Project K: ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' చిత్రంలో కీలక మార్పులు.. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్.. 
Project K
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 26, 2023 | 9:06 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ప్రాజెక్ట్ కె చిత్రంపై ఎన్నో అంచనాలున్నాయి. సైన్స్ ఫిక్షన్ చిత్రంగా వస్తున్న ఈ మూవీలో ప్రభాస్ తోపాటు.. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ కీలకమార్పు చేసింది చిత్రయూనిట్. ముందుగా ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు సంగీత దర్శకుడిగా మిక్కీ జె మేయర్ ను అనుకున్నారు. కానీ ఆయన స్థానంలో ఇప్పుడు సంతోష్ నారాయణన్ వచ్చి చేరారు. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ అశ్వినిదత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఈ మార్పుకు గల కారణాన్ని మాత్రం తెలియజేయలేదు. అంతేకాకుండా ఈ మూవీకి సంబంధించిన పలు ఆసక్తకిర విషయాలను కూడా పంచుకున్నారు.

ప్రాజెక్ట్ కె సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ అయినా.. ఇందులో ఎమోషన్స్, సెంటిమెంట్ కూడా ఉంటాయని.. ఇప్పటివరకు 70 శాతం షూటింగ్ పూర్తైనట్లు తెలిపారు. ప్రభాస్ తోపాటు.. దీపికా, అమితాబ్ లకు కూడా స్క్రీన్ ప్రజెన్స్ ఎక్కువగా ఉంటుందని.. వీరు ముగ్గురు చాలా సన్నివేశాల్లో కనిపిస్తారని.. ప్రేక్షకులు ఇప్పటివరకు చెందని సరికొత్త అనుభూతిని ప్రాజెక్ట్ కె ఇస్తుందని అన్నారు. ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ఐదారు కంపెనీలు చేస్తున్నాయని.. వాటిని తెరపై చూసినప్పుడు అద్భుతంగా ఉంటుందని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ దసరా, వెంకటేష్ నటిస్తోన్న సైంధవ్ చిత్రాలకు పనిచేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్