AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medico Preethi suicide case: ‘అమ్మా నాకు చాలా భయంగా ఉంది.. వాళ్లంతా ఒక్కటయ్యారు’ ప్రీతి ఆఖరి మాటలు

ఐదు రోజులు మృత్యువుతో పోరాడిన ప్రీతి చివరికి తనువుచాలించింది. ఆత్మహత్యాయత్నానికి ముందు రోజు అంటే ఫిబ్రవరి 21న తల్లి శారదకు ఫోన్‌ చేసి ప్రీతి మాట్లాడిన ఆడియో ఆదివారం సామాజిక మాధ్యమాల్లో..

Medico Preethi suicide case: 'అమ్మా నాకు చాలా భయంగా ఉంది.. వాళ్లంతా ఒక్కటయ్యారు' ప్రీతి ఆఖరి మాటలు
Preethi Phone Conversation
Srilakshmi C
|

Updated on: Feb 27, 2023 | 9:04 AM

Share

గత 5 రోజులుగా మృత్యువుతో పోరాడిన వరంగల్‌ వైద్య విద్యార్థిని ప్రీతి హైదరాబాద్‌ నిమ్స్‌లో ఆదివారం (ఫిబ్రవరి 26) మృతి చెందింది. వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలో పీజీ అనస్థీషియా ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న ప్రీతి ఫిబ్రవరి 22న హానికారక ఇంజెక్షన్‌ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఆమెను తొలుత వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స అందించారు. ఆరోగ్యం ప్రమాదకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. తొలుత వెంటిలేటర్‌పై, అనంతరం ఎక్మోపై చికిత్స అందించారు. ఐదు రోజులు మృత్యువుతో పోరాడిన ప్రీతి చివరికి తనువుచాలించింది. ఆత్మహత్యాయత్నానికి ముందు రోజు అంటే ఫిబ్రవరి 21న తల్లి శారదకు ఫోన్‌ చేసి ప్రీతి మాట్లాడిన ఆడియో ఆదివారం సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపింది. సీనియర్‌ పీజీ విద్యార్థి అయిన సైఫ్‌ తనతో పాటు చాలామంది జూనియర్లను వేధిస్తున్నాడని, వారంతా బయటకు చెప్పుకోవడానికి భయడుతున్నారని తల్లితో చెప్పుకుని ప్రీతి బాధపడ్డారు. సీనియర్లంతా ఒక్కటై తనను ఒంటరి చేస్తున్నారని వాపోయారు. అందుకు సంబంధించిన ఆడియో సంభాషలు ఇవే..

ప్రీతి ఆఖరి మాటలు

ప్రీతి: ఏమన్న ఉంటే నేను చూసుకుంటా. ప్రిన్సిపాల్ దగ్గరికి ఎందుకు వెళ్లావ్‌? ఆయనను కూడా పిలిచి మాట్లాడిండు.. ఏం మాట్లాడిండో తెల్వదు నాకు.

ప్రీతి తల్లి : ఊ.. వాడ్ని డాడీ ఫోన్ చేయాలి పింకీ. ఏం కాదు వాడ్ని బెదిరిస్తేనే..

ఇవి కూడా చదవండి

ప్రీతి: ఏం చేస్తారో అని నన్ను అనుకున్న

ప్రీతి తల్లి : ఆ..

ప్రీతి: ఏం చేస్తారో నన్ను అని ఉంది ఇప్పుడు

ప్రీతి తల్లి : నీకేం చేస్తాడు వాడు?

ప్రీతి: సెకండియర్‌.. వాళ్లందరిది ఒకటే బ్యాచ్ కదా

ప్రీతి తల్లి : ఆ..

ప్రీతి: ఇప్పుడాయన పేరు కంప్లయింట్ ఇచ్చినా అని నన్ను దూరం పెట్టడం ఉంటది

ప్రీతి తల్లి : అది కాదురా ఇప్పుడు. సెకండియర్ ఇయర్‌ వాళ్లు అందరూ ఒకటేనా

ప్రీతి: సెకండియర్ అందరూ ఒకటే అంటే..!! అందరూ ఉండరు ఆయనలాగ

ప్రీతి తల్లి : మరి వాళ్లు అంటలేరా? అట్ల ఎందుకు చేస్తవ్‌రా అని సెకండియర్‌వాళ్లు

ప్రీతి: వాళ్లెవరూ అంటలేరు

ప్రీతి తల్లి : అంటే.. వీడు అంత ఇదా

ప్రీతి: ఆ..

ప్రీతి తల్లి : హెచ్‌ఓడీ మాట కూడా వినడా?

ప్రీతి: ఏమో తెలియదు

ప్రీతి తల్లి : ఇప్పుడూ.. నువ్వే పోయి చెప్పినవా?

ప్రీతి: నేనే ఎందుకు పోయి చెప్పినా!!

ప్రీతి తల్లి: అదీ.. ఇప్పుడు నువ్వే ప్రిన్సిపాల్‌కి నువ్వు చెప్పినవా? నిన్ను పిలిచిండా?

ప్రీతి: ప్రిన్సిపాల్‌కి.. డాడీ ఫోన్ చేసి చెప్పినట్టే. ఎవరితో చెప్పిచ్చిండో డాడీ తెలియదు నాకు

ప్రీతి తల్లి: నిన్ను.. అక్కడ పిలిపించాడా హెచ్‌ఓడీ?

ప్రీతి: ఆ.. హెచ్‌ఓడీ పిలిపించిండు.

ప్రీతి తల్లి: ఆ..

ప్రీతి: హెచ్‌ఓడీ పిలిపించి అడిగిండు

ప్రీతి తల్లి: ఆ..

ప్రీతి: పిలిపించి.. అడిగిండు నువ్వు నా దగ్గరికి రావాల్సింది కదా.. ప్రిన్సిపాల్ దగ్గరికి ఎందుకు వెళ్లినవ్ అని అడిగిండు.

ప్రీతి తల్లి: ఎవరు హెచ్‌ఓడీనా?

ప్రీతి: ఆ..

ప్రీతి తల్లి: ఆ.. అయితే.. నాకు తెలియదు సార్‌ నాకు ఇట్ల భయం.. వాడు ఎక్కు ఇది చేస్తున్నాడు. అన్నవా?

ప్రీతి: చెప్పినా.. సర్లే నేను తర్వాత మాట్లాడుతా.. పనిలో ఉన్నా..

ప్రీతి తల్లి: ఏం భయపడకు.. ఏం కాదు.. అక్కడే ఉన్నాం మనం.. ఎక్కడో దేశంలో కూడా కాదు. ఇక్కడే కదా వరంగల్‌లో.. వాడ్ని చూసుకోవచ్చు మనం.

ప్రీతి తల్లి: వాడూ.. ఆర్పీఎఫ్‌ కొడుకా?

ప్రీతి: రైల్వేలో ఎవరో పనిచేస్తున్నరని తెలుసు.. కానీ ఏం చేస్తారో తెలియదు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.