ప్రముఖ మోడల్ హత్య.. కిరాతకంగా చంపి, ఫ్రిజ్‌లో కాళ్లు దాచిన నిందితులు
కనబడకుండా పోయిన ప్రముఖ మోడల్‌ను అత్యంత కిరాతకంగా హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఆమె కాళ్లను నరికి ఇంట్లోని ఫ్రిజ్‌లో దాచుకున్నాడా కిరాతకుడు..
కనబడకుండా పోయిన ప్రముఖ మోడల్‌ను అత్యంత కిరాతకంగా హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఆమె కాళ్లను నరికి ఇంట్లోని ఫ్రిజ్‌లో దాచుకున్నాడా కిరాతకుడు. హాంకాంగ్‌లో చోటుచేసుకున్న ఈ షాకింగ్ ఘటన శుక్రవారం (ఫిబ్రవరి 25) వెలుగులోకొచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ మోడల్, ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన అబ్బి చోయ్ (28) గత మంగళవారం నుంచి కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు ఫైల్ అయిన కొన్ని రోజుల వ్యవధిలోనే తై పో జిల్లాలోని ఓ ఇంట్లోని ఫ్రిజ్‌లో సగానికి నరికిన కాళ్లు కనిపించాయి. ఇవి మోడల్‌కు చెందినవేనని సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అదే ఇంట్లో మీట్ స్లైసర్, ఎలక్ట్రిక్ రంపాలు, పొడవాటి రెయిన్ కోట్లు, గ్లైజులు, ముఖానికి తొడిగే ముసుగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని పాత్రల్లో మనిషి శరీరానికి సంబంధించిన మాంసం అవశేషాలను గుర్తించారు. మృతురాలు అబ్బి చోయ్ తల, చేతులు, మొండెం ఇతర శరీర భాగాలు లభ్యం కాలేదని హాంకాంగ్ పోలీసులు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు వెల్లడించారు. నిందితులు ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా దేశ రాజధాని ఢిల్లీలో కొన్నిరోజుల క్రితం సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్యోదంతం తరహాలోనే హాంకాంగ్ మోడల్‌ను కూడా హత్యకు గురైంది. ఆఫ్తాబ్ పూనావాలా, తన ప్రేయసి శ్రద్ధా వాకర్‌ను అత్యంత కిరాతకంగా చంపి, ఆమె శరీర భాగాలను ఫ్రిజ్‌లో భద్రపరిచి, వేరువేరు ప్రాంతాల్లో వాటిని విసిరేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో శ్రద్ధా వాకర్ తలను ఢిల్లీ పోలీసులు ఇంకా గుర్తించలేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.